Pages

Wednesday, September 26, 2012

ప్రశాంతంగా మార్చ్‌- ప్రభుత్వం, జెఎసిల బాధ్యత



29న వినాయక నిమజ్జనం, మొదటి తేదీ నుంచి అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వున్న దృష్ట్యా వాయిదాను ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. అదే సమయంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అవరోధాలు కల్పించడం జరుగుతున్నది. పోలీసులూ అనుమతి నిచ్చేది లేదని తేల్చేశారు. నిజానికి ఈ సమస్యల సాచివేత, సమాధానాల దాటవేత, సమీకరణల అణచివేత అవాంఛనీయ పరిణామాలకు దారి తీసిన అనుభవాలు గతంలో వున్నాయి గనక అంతకంటే విజ్ఞతతో ప్రభుత్వం వ్యవహరించాల్సి వుంటుది. అనుభవాల నేపథ్యంలో ఈ మార్చ్‌ను నిరాటంకంగా శాంతియుతంగా జరగనివ్వడమే మంచిది. అదేసమయంలో నిర్వాహకులు కూడా తమవైపునుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. గణేష నిమజ్జనం సమయంలో మామూలుగానే హైదరాబాదులో ఉద్రిక్తత అందరికీ తెలుసు. జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తాము గాంధేయ పద్ధతులలో జరుపుతామని అంటున్నా గతంలో ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల విధ్వంస ఘటనలు, ఇటీవలి కొన్ని వ్యాఖ్యలు సందేహాలకు అవకాశమిస్తున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, హైదరాబాదులో జరిగిన కొన్ని విధ్వంసక ఘటనలు, కొందరు నేతల ప్రకటనలు ఉద్రిక్తత పెంచేవిగా మారాయి. కేంద్రం ఉద్దేశపూర్వకంగా చెలగాటమాడుతున్నప్పుడు సంయమనం పాటించవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపై వుంటుంది. ప్రత్యేకించి తెలంగాణా ప్రజల ప్రజాస్వామిక వారసత్వానికి మచ్చ తెచ్చే ఎలాటి చర్యకు లేదా మాటలకూ ఎవరూ పాల్పడకూడదు. ఈ సమయంలో ఎంతో బాధ్యతగా వుండాల్సిన మంత్రులతో సహా కాంగ్రెస్‌ నాయకులు తలో వైపున మాట్లాడుతూ ఉద్రిక్తల వ్యాప్తికి ఆజ్యం పోస్తున్నారు. ప్రాంతాల వారిగా వర్గాల వారిగా సమావేశాలు,ఢిల్లీ యాత్రలు జరుపుతూ తామే వివాదం పెంచుతున్నారు. నిజానికి ఒకే ప్రాంతం వారు కూడా వేర్వేరు శిబిరాలుగా విడిపోతున్నారు. తాజాగా సీనియర్‌ మంత్రి జానారెడ్డి మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనం.ఈ సంకుచిత వ్యూహాలు కట్టిపెట్టి ప్రజా శ్రేయస్సు ప్రశాంతత కోణంలో వ్యవహరిస్తే చాలా మంచిది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు పాత్రను సవ్యంగా నిర్వహిస్తే అన్ని ప్రాంతాల ప్రజలూ హర్షిస్తారు.

3 comments:

  1. అటు ప్రభుత్వం, ఇటు జె.ఎ.సి వర్గం ఎవరూ బాధ్యతల గురించి ఆలోచిస్తున్నారని యెవరికీ యే భ్రమలూ అక్కర లేదు.

    ప్రస్తుతం సమాజంలో స్వార్థం అనేదే పరమార్థం. సంకుచితత్వం అనేది వ్యక్తుల స్థాయి దాటి వ్యవస్థల స్థాయిలో స్థిరపడింది.

    ప్రభుత్వానికి కావలసినది ఉనికిని కాపాడుకోవటం.
    జె.యె.సికి కావలసినది కూడా తమ ఉనికిని కాపాడుకోవటమే.

    మధ్యలో ప్రజల ధనమానప్రాణాలంటారా? వాటి మీద యెవరికండీ అపేక్ష?
    అయితే అందరూ ప్రజల గురించే మాట్లాడుతుంటారనుకోండి.
    దానినే గదా మనం రాజకీయం అనేది?

    కం. విధి నెరిగిన ఋషివర్యులు
    విదికిం దల యొగ్గు నట్టి విబుధులు మరియా
    విధి నెదిరించెడు వారలు
    విధి నడపెడు నాటకమున వెలిగెడు పాత్రల్.

    మనస్సు చిక్కబట్టుకొని జరెగేదంతా చూడటమే మనం చేయగలిగినది.

    స్వస్తి.

    ReplyDelete
  2. అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ visit :

    http://www.logili.com/

    మీకు బాగా నచ్చిన పుస్తకాల గూర్చి మీ అభిప్రాయాలను,
    రివ్యూ లను వ్రాసి ఈ మెయిల్ అడ్రస్ కు పంపించండి
    review@logili.com
    నచ్చిన రివ్యూ లను మీ పేరు లేక మీ కలం తో ప్రచురింపబడును.

    ReplyDelete
  3. గణేష్ విసర్జన్ & జీవ వైవిధ్య సదస్సు తేదీలు ఎప్పుడో ఖరారు అయ్యాయి. జెఎసి ఎ రోజున మార్చు నిర్వహించాదలిచామన్నది మూడు నెలలు క్రిందే ప్రకటించింది. ఈ మూడు నెలలలో సర్కారు వారికి వినాయకుడు, కోప్ గుర్తు రాలేదా? ఆఖరి నిమిషంలో మేలుకొని మార్చు వాయిదా అడగడం మూర్ఖత్వం. ఇష్టారాజ్యంగా అరెస్టులు, బైన్డోవరలు, ఖాఖీ జులుముతో ప్రజల నోరు నొక్కాలని ప్రయత్నించడం అవివేకం.

    ReplyDelete