
ఇంతకు ముందే రాజకీయ మాయాజాలం గురించి, సాగర హారం నేపథ్యం గురించి రాశాను. మరోసారి టీవీ చూస్తే ఢిల్లీలో కెసిఆర్ గులాం నబీ ఆజాద్‌ను కలిసినట్టు అవగాహన కుదిరితే సోనియాగాంధీని కూడా కలిసే అవకాశం వున్నట్టు స్క్రోలింగ్‌లు కనిపిస్తున్నాయి. అంటే ఢిల్లీ మాయాజాలం ఇంకా కొనసాగుతుందన్న మాట.ఒకవేళ గతంలో అసెంబ్లీ మార్చ్ ఆఖరి నిముషంలో వచ్చిన ప్రకటన తర్వాత ఎన్ని మలుపులు తిరిగిందీ చూశాం. అలా జరుగుతుందని నేను ఆ డిసెంబర్ 10 ఉదయం చర్చలోనే(ఎన్‌టివిలో టిఆర్‌ఎస్ విద్యాసాగరరావు, అప్పటి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, మరొకరు వున్నారు) చిదంబరం ప్రకటన పాక్షికమనీ, చివరి వాక్యం కాదని చెప్పాను. ఇప్పుడు కూడా అలాటి ఒక నాటకీయ ప్రకటన లేదా వివరణ వచ్చినంత మాత్రాన విలువేముంటుంది? నిన్న గాక మొన్న విభజన సాధ్యం కాదని చెప్పిన ఆజాద్‌తో ఇప్పుడు మరో విధంగా చెప్పినా నమ్మడమెలా సాధ్యం? ఒక రాష్ట్ర భవిష్యత్తుకు ప్రజల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం ఇలా ఎపిసోడ్ల స్థాయికి పడిపోవడం నిజంగా విచార కరం. అభ్యంతరకరం కూడా. ప్రజలకు కావలసింది సాధికారిక సమగ్ర ప్రకటన తప్ప మంతనాలు, మంత్రాంగాలు కాదు. మాయాజాలం అసలే కాదు.