Pages

Wednesday, September 7, 2011

సిబిఐపై బిజెపి ద్వంద్వ భాషణం!



సిబిఐ విషయంలో బిజెపి ద్వంద్వ భాషణం చాలా హాస్యాస్పదంగా వుంది. గాలిపై చర్యలకు అభ్యంతరం లేదంటూనే సిబిఐ పక్షపాతం గురించి వారు గగ్గోలు పెడుతున్నారు. గుజరాత్‌లో సోరాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు దర్యాప్తు వారి దృష్టిలో మహాపరాధంగా వుంది. వాస్తవం ఏమంటే వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనూ సిబిఐ ఇలాటి విమర్శలే ఎదుర్కొంది. ఆఖరుకు బాబ్రీ విధ్వంసం కేసులో అద్వానీని రక్షించి తనను శిక్షించాలనడంపై ఆ పార్టీ అగ్రనాయకుడు మురళీ మనోహర్‌ జోషీ కూడా రాజీనామా చేశారు. ప్రతిపక్షంలో వుండగా స్వతంత్ర సిబిఐ వుండాలన్న వాజ్‌పేయి ప్రధాని స్తానంలో వుండి దాన్ని పూర్తిగా వినియోగించుకోవడమే గాక ప్రతిపక్షాలపై ఉసి గొలిపారు. మాయావతి వంటి వారు ఆ మేరకు తీవ్ర విమర్శలు చేశారు కూడా. కనక సిబిఐని కాంగ్రెస్‌ అనేక సార్లు దుర్వినియోగపర్చి వుండొచ్చు గాని బిజెపి కూడా అందుకు మినహాయింపు కాదు. ఇక జగన్‌ కూడా వైఎస్‌ హయాంలో దాని కితాబులు తీసుకున్న సందర్భాలున్నాయి. ఎన్ని లొసుగులున్నా అది దేశంలో అత్యున్నత పరిశోధనా సంస్థ. గతంలో వివిధ చోట్ల జరిగినవే ఇప్పుడు లక్ష్మీనారాయణ నేతృత్వంలో పునరావృతమవుతున్నాయని చెప్పడానికి లేదు. ఒక వేళ చట్టపరమైన తప్పిదాలుంటే తప్పక కోర్టుల సహాయం తీసుకోవచ్చు.అంతేగాని రాజకీయ ప్రచారం కోసం ఒకే పల్లవి పదే పదే ఆలపించడం పలితమివ్వదు.

No comments:

Post a Comment