మాజీ సమాజ్ వాది పార్టీ నాయకుడు అమర్ సింగ్‌కు అరదండాలు రాజకీయ దళారీ తనానికి గుణపాఠం. ములాయం సింగ్ యాదవ్ కుడి భుజంగా వుంటూ దేశ రాజకీయాలలో సూత్ర రహిత వ్యూహాలకు ముందు నిలిచిన అమర్ సింగ్ అణు ఒప్పందం తర్వాత అనిశ్చితిలో చిక్కిన మన్మోహన్ సర్కారును గట్టెక్కించడంలో కీలక పాత్రధారి అయ్యాడు. తన పార్టీని చేరువ చేయడమే గాక ఇతరత్రా కూడా మద్దతు దారులను పోగేసే సంధానకర్త అయ్యాడన్నది అప్పట్లొ బహిరంగంగా కనిపించిందే. ఈ సందర్భంలో బిజెపి కూడా వివాదాస్పదంగానే వ్యవహరించింది.పార్లమెంటులో నోట్లను చూపించడం సంచలనం కలిగించింది గాని వాటికోసం బిజెపి సభ్యులే తమ దగ్గరకు వచ్చారని నిందితులు అంటున్నారు.అద్వానీ సహాయకుడు సుదీంద్ర కులకర్ణి కూడా ఈ సందర్బంలో అరెస్టయ్యారు. వాస్తవంలో అమర్ సింగ్ అప్పటి పార్టీ ఎస్‌పి బిజెపికి బద్ద వ్యతిరేకిగా పేరు. అయినా సరే ఇన్ని బేరసారాలు జరిగాయంటే రాజకీయాలు ఎంత హీనంగా తయారయ్యాయో తెలుస్తుంది. పనిలో పనిగా ఈ తరుణంలోనే అమర్ సింగ్‌ను కూడా అరెస్టు చేశారు గాని అసలు ప్రభుత్వాధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ వారిని ఎందుకు పట్టుకోలేదనే ప్రశ్నకు మాత్రం సమాధానం లభించడం లేదు.ఈ వ్యవహారంలో మీడియా కూడా పాత్రధారి కావడం, పట్టివేత వ్యూహంలో బిజెపితో చేతులు కలపడం మరింత నాటకీయమైనవి. తెహల్కా, ప్రశ్నల కుంభకోణం, హవాలా వగైరా చాలా సందర్భాలలో బిజెపి నేతలు అవినీతి కుంభకోణాలలో చిక్కిపోయారు. అలాటి నేపథ్యంలో వారు కాంగ్రెస్ నేతలు ముడుపులు ఇస్తారని నిరూపించబోయిన బిజెపి నేతలు వాటిని స్వీకరించిన వారుగా ముద్ర వేయించుకోవడం రాజకీయాలలో నాటకీయ చిట్కాలు పనికి రావని వెల్లడిస్తుంది. అహ్మద్ పటేల్ తదితరుల పేర్లు కూడా ఈ వ్యవహారంతో ముడిపడివున్నాయి. మరి వారెవరైనా కనీస చర్యలకు గురవుతారా అన్నది చూడాలి.
Tuesday, September 6, 2011
రాజకీయ దళారీకి అరదండాలు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment