తెలంగాణా సమస్యపై ఏదో వెంటనే జరిగిపోతుందని భావించేవారు, జరిగిపోవాలని కోరుకునే వారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ ఇచ్చే నివేదికకు శ్రుతి మించిన ప్రాధాన్యత కల్పించారు. కాని వాస్తవం ఏమంటే దానికి ముందు తర్వాత కూడా కేంద్రం నుంచి వెలువడుతున్న సూచనల్లో కొత్తదనమేమీ లేదు.ఈ సమస్యపై వారికి అవగాహన లేదని కాదు, దాన్ని వెల్లడించాలనే ఉద్దేశమే లేదు. కెసిఆర్ ఏ జోస్యాలు చెప్పినా కాంగ్రెస్ నాయకులు మాత్రం అలాటి సాహసం చేయడం లేదు. ఎందుకంటే వారికి అంతర్గత పరిస్తితులు మరింత బాగా తెలుసు. శుక్రవారం నాడు హౌం మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్టు స్పష్టమవుతుంది. కాకపోతే కాంగ్రెస్ ఒక అవగాహనకు రావడానికి ఆజాద్ అ ద్యక్షురాలికి ఇచ్చిన నివేదిక దోహదపడుతుందని మాత్రం అనుకోవాలి. ఎనిమిది మాసాల కిందట ఇచ్చిన శ్రీకృష్ణ నివేదికకే ఠికాణా లేనప్పుడు ఈ ప్రహసనంతో ఏదో ఒక వొరిగి పడుతుందని మౌలిక నిర్ణయాలు మారిపోతాయని బొత్తిగా ఆశించలేము. నిజానికి సమయం చాలా పడుతుందని ఆజాద్ నిన్న, చిదంబరం ఈ రోజు స్పష్టంగా చెప్పారు. ఎవరైనా ఈ వాస్తవాలను గమనంలో పెట్టుకుని వ్యవహరించాల్సి వుంటుంది.
Friday, September 30, 2011
ఆజాద్ నివేదిక, అనంతరం..
తెలంగాణా సమస్యపై ఏదో వెంటనే జరిగిపోతుందని భావించేవారు, జరిగిపోవాలని కోరుకునే వారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ ఇచ్చే నివేదికకు శ్రుతి మించిన ప్రాధాన్యత కల్పించారు. కాని వాస్తవం ఏమంటే దానికి ముందు తర్వాత కూడా కేంద్రం నుంచి వెలువడుతున్న సూచనల్లో కొత్తదనమేమీ లేదు.ఈ సమస్యపై వారికి అవగాహన లేదని కాదు, దాన్ని వెల్లడించాలనే ఉద్దేశమే లేదు. కెసిఆర్ ఏ జోస్యాలు చెప్పినా కాంగ్రెస్ నాయకులు మాత్రం అలాటి సాహసం చేయడం లేదు. ఎందుకంటే వారికి అంతర్గత పరిస్తితులు మరింత బాగా తెలుసు. శుక్రవారం నాడు హౌం మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్టు స్పష్టమవుతుంది. కాకపోతే కాంగ్రెస్ ఒక అవగాహనకు రావడానికి ఆజాద్ అ ద్యక్షురాలికి ఇచ్చిన నివేదిక దోహదపడుతుందని మాత్రం అనుకోవాలి. ఎనిమిది మాసాల కిందట ఇచ్చిన శ్రీకృష్ణ నివేదికకే ఠికాణా లేనప్పుడు ఈ ప్రహసనంతో ఏదో ఒక వొరిగి పడుతుందని మౌలిక నిర్ణయాలు మారిపోతాయని బొత్తిగా ఆశించలేము. నిజానికి సమయం చాలా పడుతుందని ఆజాద్ నిన్న, చిదంబరం ఈ రోజు స్పష్టంగా చెప్పారు. ఎవరైనా ఈ వాస్తవాలను గమనంలో పెట్టుకుని వ్యవహరించాల్సి వుంటుంది.
Wednesday, September 28, 2011
కొత్త జోస్యాలు- పాత భాష్యాలు
కెసిఆర్ ఈ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన అయిదారుగురు నాయకులలో ఒకరుగా గౌరవనీయులు. కొత్త రాష్ట్రమే సాధించి దాని వ్యవస్థాపకుడు కావాలని కోరుకునే వ్యక్తి.అయితే దురదృష్టవశాత్తూ ఆయన మాటలు చేతలు తరచూ వివాదాస్పదంగానూ నిరాధారంగానూ వుంటాయి. ఈ బ్టాగులో గత ఎంట్రీలలో చేసిన వ్యాఖ్యలు విశ్లేషణలు చదివిన వారికి ఈ సంగతి బాగా తెలుసు.తాజాగా ఇప్పుడాయన కేంద్రం రెండు మాసాలలో తెలంగాణా ఇచ్యేస్తుందని చెప్పడం ఆ కోవలో మరో ప్రహసనం. అంతటితో ఆగక కేంద్రం ఆలోచనలుగా తనకు తెలిసిన వాటిని ఆయన ఇంచుమించు ప్రతిపాదనల చర్చగా మొదలెట్టారు. కర్నూలు అనంతపురంలతో కూడిన తెలంగాణా, హైదరాబాదు ప్రతిపత్తి వంటివాటిని ఈ కోవలో వదిలారు. వీటిపై తెలంగాణా ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టిఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు.తమాషా ఏమంటే గతంలో కాంగ్రెస్ ప్రతినిధుల నిరాహారదీక్షా శిబిరం దగ్గర ప్రకటన చేసినట్టే ఇప్పుడు కూడా ఢిల్లీలో చర్చలు జరుపుతున్న వారికన్నా ముందే ఈ అంశాలు ఆయన మాట్లాడారు. అయితే కాంగ్రెస్ వాదులు మాత్రం వీటిని ధృవపర్చిన దాఖలాలు లేవు. ఉద్యమాలను ఉత్సాహ పర్చడం కోసం కెసిఆర్ ఇలాటివి మాట్లాడుతుంటారని ఆయన సహచరులు చెప్పే వివరణ దీనికీ వర్తిస్తుందనుకోవాలి.కాకపోతే వూహాగానాలతో వుత్తుత్తి కథనాలతో ఉత్సాహపర్చినా అది నిలబడుతుందా? తర్వాత కలిగే నిరుత్సాహం మరింత తీవ్రంగా వుండదా? ఈ అంశాలను ఆయన పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. ఈ క్రమంలో విశ్వసనీయత దెబ్బతినడమూ కద్దు.ఇంతా చేసి భౌగోళికంగానూ చారిత్రికంగానూ రెండు రాయలసీమ జిల్లాలను తెచ్చికలపడం కుదిరేది కాదు. అలాటి ప్రతిపాదన తీవ్రంగా వచ్చే అవకాశమూ లేదు. కనక ఇది కెసిఆర్ మాటల పొదిలోంచి వదిలిన మరో అస్త్రంగానే భావించాలి. ఈ మాటలకు ముందు ఆయన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో మాట్టాడ్డం వల్ల ఇవి ఆయన భావాలకు దగ్గరగా వున్నాయని కూడా చెప్పొచ్చు.
Tuesday, September 27, 2011
లగడపాటి రాక- రాజకీయ కాక
సకల జనుల సమ్మె సగం నెల పూర్తి అవుతున్న సందర్భంలో విజయవాడ కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ రంగ ప్రవేశం పరిస్తితిని అకారణంగా వుద్రిక్త పరిచింది. ఆర్టీఏ అధికారి పినిశెట్టి శ్రీనివాస్‌పై దాడిని అందరూ ఖండించారు. అందుకు కారకుడైన వ్యక్తిని తామే అప్పగించామని కూడా జెఎసి నాయకులొకరు నాతో చెప్పారు. ఏపీ ఎన్జీవో సంఘం నాయకుడు గోపాల్ రెడ్డి కూడా దీనిపై ఆందోళన వెలిబుచ్చారు. అలాటి ఘటనలు పునరావృతం కాకుండా వివిధ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య ఉద్రిక్తత పెరక్కుండా చూసుకోవలసింది.అయితే లగడపాటి రాజగోపాల్ పరామర్శ పేరిట రావడంతో పరిస్తితి రాజకీయ రంగు పులుముకోవడం సహజం. గతంలో కెసిఆర్ నిరాహారదీక్ష సందర్భంలోనూ ఆయన ఇలానే చేశారు.వీటివల్ల ఆయనకు రాబిన్ హుడ్ ఇమేజ్ వస్తుందనుకుంటారేమో గాని రాష్ట్రంలో పరిస్తితి దిగజారుతుందని గుర్తించాలి. దానికి ప్రతిగా తెలంగాణా నాయకులు (మళ్లీ కాంగ్రెస్ వాదులతో సహా) వెళ్లడం, పోలీసులతో ఘర్షణ, నాయకులపట్ట ప్రవర్తనపై ఆగ్రహం, హరీష్ రావు సొమ్మసిల్లేందుకు దారి తీసిన ఘర్షణ ఇవన్నీ గత పదిహేనురోజులలో లేని కొత్త పరిస్థితికి దారి తీశాయి.ఈ ఉద్రిక్తతలు కొనసాగకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతివారిపై వుంది. ఢిల్లీలో నాయకత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమోనని ముందే ప్రభావం ప్రసరించాలన్న ఆదుర్దా అందరిలో వున్నట్టు స్పష్టమవుతుంది. అది అర్థం చేసుకోవచ్చుగాని ఆ కారణంగా అవాంఛనీయ పరిస్తితులను సృష్టించుకోవడం ఎవరికీ మంచిది కాదు.
శంకర్ రావుపై జడ్జి ఆదేశం ప్రభావం?
ఎప్పటికప్పుడు ఏవో విపరీత వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే మంత్రి శంకర్ రావు హౌం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యను సుమోటాగా తీసుకోవాలని సిబిఐ దర్యాప్తు జరిపించాలని జస్టిస్ నరసింహారెడ్డి ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి.అయితే ఆ ఆరోపణల లాగే ఈ ఆదేశం కూడా ఇంకా పూర్తి స్వరూపం తీసుకోవలసి వుంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజా ప్రయోజన వాజ్యం కింద దీన్ని తీసుకోవడానికి అన్ని అర్హతలు వున్నాయని న్యాయమూర్తి భావించినప్పటికీ తుది నిర్ణయం జరగాల్సింది మరోచోట. శంకరరావు వ్యాఖ్యలు మంత్రివర్గంలో అస్తవ్యస్త పరిస్థితిని ప్రతిబింబిస్తున్న మాట నిజమే గాని న్యాయమూర్తి ఆదేశాల పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకుంటేనే విషయం అర్థమవుతుంది.
Monday, September 26, 2011
టీ కాంగ్రెస్ నేతల ఆగ్రహావేశాలు
సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సోమవారం తీవ్రస్థాయిలోనే రంగంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిపైనా నేరుగా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అధిష్టానంపైన కేంద్రంపైన మాత్రం ఇంకా విశ్వాసం ప్రకటించడం గమనించదగ్గది. ప్రాంతీయ విధేయతకు పార్టీ విధేయతకూ మధ్యన వారు తమ స్థానాన్ని నిర్ణయించుకోనంత వరకూ ఈ మాటల వల్ల ప్రయోజనం వుండదు.దామోదరరెడ్డి అవసరమైతే కొత్త పార్టీ వస్తుందని అన్నప్పటికీ ఆ మాటలలో వుండాల్సిన తూకం లేదు. ఇదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా రాష్ట్రం రావడాన్ని ఎవరూ వ్యతిరేకించదం లేదని, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజునే ఈ మాట చెప్పడం మరో విశేషం. నిన్న మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ తమ పాత విధానాన్నే పునరుద్గాటించారు. వీటన్నిటిని బట్టి సమ్మె ఉధృతిని బట్టి ఏదో ఒక పరిష్కారం రాబోతుందని అనుకోవడానికి ఆస్కారముంది.అయితే కాంగ్రెస్ ధోరణి రీత్యా అలా అనుకోవడం అవాస్తవికతే అవుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఏ సమస్యనూ వారు పరిష్కరించకుండా అట్టిపెట్టి రాజకీయం నడపడానికి అలవాటు పడిపోయారు. ఒక విధానం చెప్పి దానిపై నిలబడటం కంటే ఏమీ చెప్పకుండా అందరినీ ఆడించుకునే అవకాశవాదం
Saturday, September 24, 2011
సకల సమ్మె- సంఘాలు, సర్కార్లు, పార్టీలు
సకల జనుల సమ్మె ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నా ప్రభుత్వాలలో ప్రతిస్పందన కనిపించడం లేదు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా ప్రతిష్టంభన కొనసాగించడం బాధ్యతా రహితం. రావణ కాష్టంలా రగులుతున్న ఈ సమస్యలో స్వీయ లాభ నష్టాల లెక్కలు తేలక కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంతో, ప్రజలతో చెలగాటమాడుతున్నది. రెండు వారాలకు చేరుతున్న సకల జనుల సమ్మె ప్రభావంతో పరిస్తితులు మరింత దిగజారుతున్న స్థితి. అయినా ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, అభిషేక్ సింఘ్వీలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు స్పందనా రాహిత్యానికి అద్దం పట్టాయి. ఈ దశలో ఏ విధమైన ఒత్తిడికి తలొగ్గి నిర్ణయాలు తీసుకునేది లేదన్న సంకేతం పంపించడానికే కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు ఇలా మాట్లాడుతున్నారన్నది స్పష్టం. మరోవైపు అదే అధికార పక్షానికి చెందిన ప్రజా ప్రతినిధులూ ఆఖరుకు మంత్రులూ ఆందోళన కారులను మించి పోయి మాట్లాడుతున్నారు. సమ్మెకు నాయకత్వం వహిస్తున్న నాయకులు ప్రత్యేక తెలంగాణా ప్రకటించేవరకూ సమ్మె ఆపేది లేదని ప్రకటిస్తున్నారు. ఈ పూర్తి విరుద్ధ వైఖరుల అనిశ్చితి ఇంకెంత కాలం సాగుతుందని అన్ని ప్రాంతాల ప్రజలూ ఆందోళనకు గురి కాక తప్పడం లేదు.అధిక ధరలు, కొత్త భారాలు, వ్యవసాయ సమస్యలు స్తంభించి పోయిన ఆర్థిక జీవితం, కొడిగట్టిన పరిపాలన, అవాంఛనీయ వాతావరణాన్ని సృష్టించాయి.
నాలుగు స్తంభాలాట
తెలంగాణా సమస్య అంటున్నప్పటికీ ఇది ఆంధ్ర ప్రదేశ్ మొత్తం భవిష్యత్తుతో ముడిపడిన వ్యవహారం. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ వైఖరులను ఇప్పటికే తెలియజేశాయి. ప్రాంతాలను బట్టి మాట్లాడే కాంగ్రెస్ తెలుగు దేశం అదే వైఖరి కొనసాగిస్తున్నాయి. తెలంగాణా ప్రాంతంలోనే ప్రత్యేక రాష్ట్ర కోర్కెను వినిపిస్తూన్న కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి, టిఆర్‌ఎస్‌లు తమ తమ వ్యూహాల సమరం సాగిస్తూనే వున్నాయి. ఇవి కొన్ని సార్లు మాటల యుద్ధాలకే పరిమితమైతే కొన్నిసార్లు ప్రత్యక్ష ఘర్షణలు దాడులుగానూ పరిణమిస్తున్నాయి. పార్టీలు మాత్రమే గాక రకరకాల జెఎసిలు కూడా ఏర్పడ్డాయి. ఇలాటి సమయంలో రాజకీయ శక్తులన్ని ఏకాభిప్రాయంతో ఏదో చెప్పేదాక పరిష్కారం ప్రసక్తి లేదని కేంద్రం చేతులు దులుపుకోవడం కుటిలత్వమే. అఖిల పక్ష సమావేశం ప్రకారం నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికనిచ్చి ఎనిమిది మాసాలు గడిచిపోయినా ఏమీ తేల్చకుండా కాలం గడపడం వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చే పథకం తప్ప మరేమీ కాదు. గతంలో అలాటి అనేక నిర్వాకాలకు కారణమైన కాంగ్రెస్ చరిత్రను ఎవరూ మర్చిపోలేదు.
ఇప్పుడు కూడా ప్రాంతాల వారిగా వీరంగం తొక్కుతున్న వారిలో కాంగ్రెస్ నేతలే ముందుండటం గమనించదగ్గది. తెలుగు దేశం నేతలు తర్వాతి స్తానం ఆక్రమిస్తున్నారు. ఇక బిజెపి అధికారికంగానే ప్రత్యేకాంధ్ర ఉద్యమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. ఇవన్నీ జాతీయ, రాష్ట్ర పార్టీలనుకుంటే ఒక ఉప ప్రాంతానికే పరిమితమైన టిఆర్‌ఎస్ కూడా వ్యూహపరమైన వైరుధ్యాలనే ప్రతిబింబిస్తున్నది. లాబీయింగు ద్వారా లక్ష్య సాధన చేస్తామన్న
Friday, September 23, 2011
కేంద్రం వైఖరిపై అడుగంటిన ఆశలు
త్వరలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తథ్యం అని కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రకటించారు. ఇలాటి ప్రకటనే లోగడ కెసిఆర్ చేసి తర్వాత సవరించుకున్న తీరు అందరికీ తెలుసు. సకల జనుల సమ్మె ఉధృతంగా జరుగుతుంది గనక కేంద్రం వైఖరి మారుతుందని కొందరు అనుకోవడం అవాస్తవికమే. ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా కేంద్రం అలసత్వాన్ని చెలగాటాన్ని అందరూ అభిశంసిస్తున్నారు. ఇది యాదృచ్చికమేమీ కాదు.ఉద్దేశ పూర్వకమే. సకల సమ్మెపై రేణుకా చౌదరి, అభిషేక్ సింఘ్వీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందరూ ఒకే స్వరం వినిపించడం వెనక స్పష్టమైన రాజకీయ సంకేతాలున్నాయి. గత కొద్ది మాసాలలోనూ వివిధ పార్టీల ప్రముఖులతో ఆంతరంగికంగా మాట్లాడినప్పుడు (ప్రాంతాల తేడా లేకుండా) అందరూ చెబుతున్నదేమంటే కేంద్రం ఎలాటి తీవ్ర నిర్ణయం తీసుకోబోవడం లేదు అని. అత్యంత ముఖ్యమైన నేతల మాటలు కూడా అలానే వున్నాయి.. కేంద్రం వైఖరి ఇప్పట్లో మారే సూచనలూ లేవు. మార్చుకుంటే కలిగే లాభం ఏమీ వుండదని వారు గట్టిగా భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రయోజనాల కోణం నుంచి తప్ప అంతకంటే విశాలంగా ఆలోచించే అవకాశం ఎలానూ వుండదు. ప్రతి వారూ ప్రతిచోటా అడిగే ప్రశ్న ఇదే గనక నాకున్న సమాచారాన్ని పంచుకుంటున్నాను
చిదంబర రహస్యాలు తేల్చాల్సిందే!
2 జి స్ప్రెక్ట్రం కుంభకోణం యుపిఎ 2 ప్రభుత్వాన్ని పట్టి కుదిపేయడం ఖాయంగా కనిపిస్తుంది. రాజాను కాపాడటానికి మొదట్లో గట్టిగా ప్రయత్నించిన ప్రధాని మన్మోహన్ సింగ్ తర్వాత న్యాయస్థానాల ముందు తల వంచక తప్పలేదు. ఆ తర్వాత కూడా సంకీర్ణ (అ)ధర్మం పేరిట తనను తాను సమర్థించుకోవడానికి విఫలయత్నం చేశారు. ఆ సెగ కనిమొళి, మారన్ తదితరులందరికీ తాకింది.అయితే ఈ వ్యవహారంలో ప్రధాని కార్యాలయం, నాటి ఆర్థిక మంత్రి చిదంబరం పాత్రను కూడా విచారించాలన్న డిమాండు వస్తూనే వుంది. దాన్ని ఎంతగా పెడచెవిని పెట్టినా ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ లేఖ బయిటకు వచ్చాకనైనా స్పందించక తప్పడం లేదు. చిదంబరంపై కూలంకషమైనదర్యాప్తు జరగాలంటే ఆయన నేతృత్వంలోని సిబిఐకి స్వేచ్చ వుంటుందా? ఆ కోణం నుంచి చూస్తే ఆయన తప్పక ఇంటి దోవ పట్టాల్సి రావచ్చు. యుపిఎకు ఒక మూల స్తంభంగా వున్న చిదంబరం కూడా వేటుకు గురైతే ప్రభుత్వ పునాదులు కదలడం అనివార్యం. అసలు ప్రణబ్ ముఖర్జీ లేఖ బయిటకు రావ్టడం వెనక అత్యున్నత స్తాయి అంతర్గత కలహాల ప్రభావం వుందా అని కూడా ఆనుమానించక తప్పదు. మసకబారిన మన్మోహన్ ప్రభకు ఇదో తాజా దెబ్బ. అపర చాణక్యుడిగా వెలుగొందిన చిదంబరం ఇంతటి ఇరకాటంలో పడటం చూస్తే ఈ నాటి రాజకీయాల మేడిపండు స్వరూపం స్పష్టమవుతుంది.
Wednesday, September 21, 2011
Modification by fasting?
Remember the word Modification ? It is back in a garb.In the aftermath of 2002 genocide it was the name given to the political strategy of Narendra Modi. Now US appears to be hell bent on Modification. The very country which rejected a visa to him and angered every Indian now ready to do business with him. That is US. This certificate preceded the Fast of Modi aimed at show casing a different face. That apart a great myth is sought to be created around him as a icon of vibrancy and effective ruling with almost no corruption.
Remember the feel good projection that was rejected out right after Vajpaye rule? Modi attempting the same is ridiculous and incredible. Maybe he sustained the growth of an already developed state and controlled corruption to some extent. Business men may praise him for their own reasons but to depict him as icon of development is far from true.
The mute point is getting acceptability to Modi. Just three points are enough. Vajpaye as PM asked him to quit and then backtracked under pressure. Anna Hazare drawn flack from various quarters for praising him. Finally Nitish Kumar, another CM won laurels from us himself refused to share platform with him during elections. Modi enjoys. On the occasion of the fast JD(U) is once again recorded it’s reservations on MODI. Then Advani was summoned by
Tuesday, September 20, 2011
కెసిఆర్ మరో దీక్ష యోచన- రాజకీయ కారణాలు
మరోసారి నిరవధిక నిరాహారదీక్ష చేయాలని టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్ర శేఖర రావు ఆలోచిస్తున్నట్టు మంగళవారం ఉదయం చాలా పత్రికలు వార్తలిచ్చాయి. ఉదయం టీవీ9 న్యూన్‌వాచ్‌లో ఆ పార్టీ మాజీ ఎంపి వినోద్ మాట్లాడినప్పుడు కూడా పరోక్షంగా అందుకు బలం చేకూర్చే వ్యాఖ్యలే చేశారు.మధ్యాహ్నం తర్వాతనైతే మరిన్ని ఛానళ్లు ఆ అంశం తీసుకొచ్చాయి.టీవీ5లో ఫోన్ ఇన్ ఇచ్చినప్పుడు మరో వైపు నుంచి తారక రామారావు కూడా మాట్లాడారు. ఎన్టీవీ కూడా దీనిపైనే అభిప్రాయం వివరంగా తీసుకున్నది. సాయింత్రం సాక్షికి వెళ్లినప్పుడు కెసిఆర్ విద్యుత్ ఉద్యోగుల సమావేశంలో దీనిపై చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ చూడగలిగాను.
సకల జనుల సమ్మె సందర్భంగా విద్యార్థులపై సాగిన దాడికి దెబ్బలకు బాధ కలిగి కెసిఆర్ నిరాహారదీక్ష యోచన చేశారని పైన చెప్పిన నాయకులు అన్నారు.అయితే ఆయన మాటలు ప్రత్యక్షంగా విన్నప్పుడు మాత్రం
Friday, September 16, 2011
సెప్టెంబరు 17: వాస్తవాలు, వక్రీకరణలు
సెప్టెంబరు 17 పేరిట తెలంగాణా ప్రాంతంలో షరామామూలుగా ఈ ఏడాది కూడా రకరకాల రాజకీయ శక్తులు హడావుడి సాగిస్తున్నాయి. విమోచనా విద్రోహమా అని చర్చలు నడుపుతున్నాయి. పదేళ్ల కన్నా ముందు బిజెపి దీన్ని తెరమీదకు తెచ్చింది. తర్వాత టిఆర్‌ఎస్, కాంగ్రెస్ తెలుగు దేశం నాయకులూ దాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు దళిత బలహీన వర్గాలు వెనకబడిన తరగతుల పేరిట మరో విధమైన విశ్లేషకులూ బయిలు దేరి ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులపై దాడి ఎక్కుపెడుతున్నారు. మరికొందరు చరిత్ర కారులమంటూ యథాశక్తి గజిబిజి పెంచే పనిలో నిమగమైనారు. బిజెపికి బొరుసు లాటి మజ్లిస్ కూడా రంగ ప్రవేశం చేసింది. ముందొచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు అరవై ఏళ్ల కిందట ఈ తేదీకి ముందు వెనక పోరాట చరిత్ర నిర్మించిన కమ్యూనిస్టుల కన్నా , వారి నాయకత్వంలో పోరాడిన వీర తెలంగాణా యోధుల కన్నా వీరి హడావుడి ఎక్కువగా వుంది. వీటన్నిటి మధ్యనా వామపక్షాలు సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్నాయి.
మా నిజాం రాజు తరతరాల బూజు అని దాశరథి ఈసడించిన పరమ పైశాచిక పాలనకు వెట్టిచాకిరీకి దొరల చెరలకు మట్టిమనుషులు లిఖించిన మరణ శాసనం
Thursday, September 15, 2011
రెండు మాసాలా? రెండేళ్లా? రెండూ కాదా?
అధిష్టానాన్ని కలుసుకుని వచ్చిన పిసీసీ పీఠాధిపతి బాన్స్‌వాడలో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఓడిపోతామని తెలిసీ ఇలా ఆదేశించడంలో చూడగలిగితే స్పష్టమైన సంకేతాలే వున్నాయి.టిఆర్‌ఎస్‌తో ప్రస్తుతానికి రాజీ పడదలచలేదని, తమ సా ్థనాన్ని వదులుకోవాలనుకోవడం లేదని తెలుస్తూనే వుంది. పోటీ వద్దనే వారు కూడా ఓటమి భయంతో తప్ప మరే విశాల దృష్టితో కాదు. తెలుగు దేశం అసలు ఎవరూ పోటీ చేయొద్దని చెబుతుంది గాని ఆ మాట వినేవారుండరని వారికీ తెలుసు. టీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో గెలిచినా రాజకీయ పరిస్తితిలో దాని వల్ల వచ్చే నాటకీయ తక్షణ పరిణామాలేమీ వుండవు కూడా.కాకపోతే రెండు మాసాల్లో ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చేస్తుందని అది ఒక పక్షానికి సంతోషంగా వుండకపోవచ్చని బోత్స అంటున్న మాటను ఎటైనా అర్థం చేసుకోవచ్చు. కాని కాంగ్రెస్ ఇచ్చేట్టు లేదన్న కెసిఆర్ మాటలు, టి కాంగ్రెస్ వాదుల నిర్వేదం బట్టి చూస్తే బొత్స మాటల వెనక వున్నదేమిటో చూచాయగా అర్థమవుతుంది. రెండు మాసాల వ్యవధి కోసం ఇలా అంటున్నారా లేక రెండేళ్ల తర్వాత పరిష్కరిస్తామని అప్పుడు చెబుతారా అనేది కూడా చూడాల్సిందే. గతానుభవాలను బట్టి చూసినప్పుడు ఈ మాటలపై ఏవేవో భాష్యాలు చెప్పుకుని ఆవేశాలు వివాదాలు పెంచుకోవడం అర్థరహితమని గ్రహిస్తే శ్రేయస్కరం.
వికల దృశ్యంలో సకల సమ్మె
ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణా ప్రాంతంలో జరుగుతున్న సకల సమ్మెపై కేంద్రీకృతమై వుంది. ఈ మాటను ఇంగ్లీషులో ఏమంటారు అని ఎవరో అడిగారు.మామూలుగా జనరల్ స్ట్రెక్ అన్నప్పుడు సార్వత్రిక సమ్మె అని అనువదించడం జరుగుతుండేది. ఈ సకల జనుల సమ్మె మాటను యూనివర్సల్ స్ట్రైక్ అనొచ్చు. పేరు నిర్వచనం ఏమిటనే దానికంటే ఎంత విస్త్రతంగా వుధృతంగా జరుగుతుందనేది ముఖ్యం. ఇప్పుడున్న నేపథ్యంలో ఈ సమ్మె ఉధృతంగానే మొదలవుతుందని అందరూ అనుకున్నారు.ఎక్కడ ఏ తరగతులు ఏ మేరకు కలసి వస్తారనేది అలా వుంచితే వుద్యోగుల వరకూ పాల్గొంటారన్నదీ ముందే స్పష్టమైంది. అదే జరిగింది కూడా. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా గొంతు కలపడం దీనికి మరింత వూతమిచ్చినట్టయింది. అత్యవసర సర్వీసులను మినహాయించినా పరోక్షంగా గని కార్మికుల సమ్మె ఆ మినహాయింపును మించిపోయింది. ఏ పోరాటంలోనైనా ప్రజలపై ఎంతో కొంత ప్రతికూల ప్రభావం పడటం తప్పనిసరి గాని ఇక్కడ ప్రత్యేకంగా ప్రాంత ప్రజలకు ఎక్కువ నష్టం కదా అన్న ప్రశ్నలు వస్తుంటాయి. రాజకీయ పరిష్కారం సూచనలేమీ లేనప్పుడు ఈ పోరాటం ఎంత కాలం సాధ్యమన్న ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే ముఖ్యమైందేమంటే తెలంగాణా సమస్య 2014 వరకూ తేలేది కాదని స్వయంగా కెసిఆర్ వ్యాఖ్యానించి వున్నారు. ఢిల్లీకి ప్రదక్షిణల ప్రహసనం జరుపుతున్న కాంగ్రెస్ నేతలు కూడా అయోమయంగానూ ఆశాభంగంతోనూ తిరిగి వస్తున్నారు. ఏదో ఒక ప్రకటన వస్తుంది అని తప్ప తమకు అనుకూలంగా వస్తుందని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు చెప్పలేకపోతున్నారు. అన్ని పార్టీలూ వస్తేనే అఖిలపక్ష సమావేశం సాధ్యమని కేంద్ర హొంమంత్రి చెబుతుంటే తాము హాజరుకాబోమని ప్రధాన ప్రతిపక్షం ప్రకటిస్తున్నది. వీటన్నిటిలోనూ భవిష్యత్ పరిణామాలు దాదాపుగా అర్థమవుతూనే వున్నాయి. పైగా తెలంగాణా క్షేత్రంలోనూ టిఆర్‌ఎస్, కాంగ్రెస్, తెలుగు దేశం, బిజెపి తమ తమ ప్రయోజనాల కోణాలను తాము అనుసరిస్తున్నాయి. అందరూ తెలంగాణా ప్రజల పేరు చెబుతున్నా జరుగుతున్నది ప్రయోజనాల పాకులాట అని జనం చూడగలుగుతున్నారు. అందువల్లనే సకల జనుల సమ్మెకు సాద్యమైనంత హేతుబద్దమైన ప్రజాస్వామికమైన పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుంటుంది. ఈ లోగా ఇరు ప్రాంతాలలోనూ ప్రధాన పార్టీల నాయకులు కవ్వింపు ధోరణులతో మాట్లాడ్డం మానుకోవాలి కూడా.ఏ ప్రాంత ప్రజల మనోభావాలు ఏమైనప్పటికీ ఈ దుర్భాషలు దూషణలు మాత్రం వారు కోరుకోవడం లేదు.1969లో తెలంగాణాలోనూ, 1972లో ఇతర చోట్ల స్వార్థపరులైన నేతల ప్రచారాలను నమ్మి సమ్మెలు చేసి కష్టనష్టాల పాలైంది ప్రధానంగా ఉద్యోగులు విద్యార్థులే. ఆ అనుభవాలను ఇప్పుడు కూడా గుర్తుంచుకున్నామనే ఉద్యోగ నాయకులు చెబుతున్నారు.కనకనే అందరూ విజ్ఞతగా వ్యవహరిస్తారని ఆశించాలి.
మోడీకి కితాబు... అద్వానీకి జవాబు!
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సమర్థతకు మారు పేరు అని అమెరికా కాంగ్రెస్ రిసెర్చి విభాగం పెద్ద నివేదిక నివ్వడంపై ఆయనతో సహా ఆ పార్టీ ఆనందోత్సాహాలలో మునిగిపోవడం సహజమే. ఆరేళ్ల కిందట అమెరికా ఆయనకు వీసా నిరాకరిస్తే అన్ని పార్టీలూ ఖండించాయి. తర్వాత కాలంలో ఆయన విధానాలలో గాని ఆలోచనల్లో గాని ఏ మార్పు వచ్చింది లేదు. అయినా అమెరికా ఇంతగా పొగుడుతున్నదంటే అవసరాన్ని బట్టి మార్చుకున్న వ్యూహమై వుండాలి. మోడీకి తమ ఆమోదం వుందన్న సందేశం పంపించడమే వారి ఉద్దేశం. ఇతర పార్టీల సంగతి ఎలా వున్నా మరోసారి భారత యాత్ర ప్రకటించిన మహా రథికుడు అద్వానీకే ఇది అశని పాతం. ఎందుకంటే
మసక బారిన క్యారెక్టర్ పాత్రలు
సినిమా అంటే హీరో హీరోయిన్లే కదా.. ఫలానా హీరో సినిమా అంటారు.. అందుకోసం ఎదురు చూస్తారు.. బాగుంటే కేరింతలు కొట్టడం,బాగాలేకుంటే చప్పుడుచేయకుండా సర్దుకోవడం ఇవన్నీ మామూలే. మొత్తం ప్రచారమంతా ఆ హీరోల చుట్టూనే! కొంతవరకు హీరోయిన్లు ఆ పైన కమెడియన్తు, కొత్తగా వచ్చిన వారైతే విలన్లు.. అంతే! అయితే ఏ చిత్రం కూడా వీళ్లతోనే పూర్తయిపోదు. వీళ్లకు తోడుగా అనేక ఇతర పాత్రలుంటాయి. అవే క్యారెక్టర్ పాత్రలు.
తమాషా ఏమంటే అసలు క్యారెక్టర్ అంటేనే పాత్ర. మరి క్యారెక్టర్ పాత్రలేమిటి అంటే ఇది సినిమా భాష. నాయికానాయకులు చుట్టూ తిరిగే సినిమా రంగంలో ఇతరత్రా ప్రాధాన్యత గల పాత్రలను ఆ పేరుతో పిలవడం కద్దు. మామూలు భాషలో చెప్పాలంటే తల్లులు, తండ్రులు, అన్నలు, వదినెలు, అత్తలు మామలు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, జానపదాల్లో రాజులు మంత్రులు వంటి పాత్రలు. ఇవన్నీ చెబుతుండగానే పాఠకుల కళ్లలో కొందరు మహామహులైన నటీనటులు కదలాడటం మొదలెడతారు. సందేహం లేదు-నాలుగు పదులకు అటూ ఇటుగా వున్నవారికి ఆ పై వారికి ముందుగా గుర్తుకు వచ్చే గంభీర విగ్రహుడు ఎస్వీఆర్. తర్వాత
కృష్ణశాస్త్రీయ గీతామృతం
తెలుగు తియ్యదనమూ, ప్రకృతి సౌందర్యమూ, ప్రేమ సౌకుమార్యమూ, మానవీయ మహత్వమూ కలబోసుకున్న మధుర భావకుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి. భావ కవితా పితామహుడుగా సుప్రసిద్ధుడైన ఆయన తెలుగు సినిమా పాటకూ గోరింట వన్నెలు అద్దారు. తర్వాతి కాలంలో మరెవరైనా సున్నితమైన పదాలతో సుకుమార గీతాలు రాసినా వాటిని వెనువెంటనే కృష్ణశాస్త్రి రచనలుగా పరిగణించేంత బలంగా చెరగని ముద్రవేశారు. మనసు లోలోతులు తాకే మధుర వీవన వంటిది ఆయన పాట. గుండెలలో గులాబీలు పూయించే సృజన శీలత ఆయన కలానిది. రాసిన పాటల సంఖ్య తక్కువే అయినా వాటి ప్రభావం ప్రాభవం అనితర సాధ్యమైనవి. మల్లీశ్వరితో బిఎన్‌రెడ్డి రంగ ప్రవేశం చేయించిన దేవులపల్లి వాణిజ్య చిత్రాలలోనూ తన బాణీ నిలబెట్టుకోవడం అసాధారణ విజయం.
దేవులపల్లి కృష్ణశాస్త్రి చలన చిత్ర గీతాలు గతంలో మేఘమాల,గోరింట పేర్లతో సంపుటాలుగా వెలువడ్డాయి.ఇప్పుడు ఆ రెంటినీ కలిపి విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్ వారు ఒకే పుస్తకంగా తెచ్చారు. కృష్ణశాస్త్రి రచనా సర్వస్వంలో మూడవ సంపుటంగా వెలువడిన ఈ వెండితెర పాటలు రస హృదయులైన ప్రేక్షకులకు కవితాభిమానులకు గొప్ప కానుకలేనని చెప్పాలి.
సహజంగానే ఈ పుస్తకం మల్లీశ్వరి పాటలతో మొదలవుతుంది. అందులోని పదిహేను పాటలు కృష్ణశాస్త్రివే. అందులోకోతి బావకు పెళ్లంట, పరుగులు తీయాలి, పిలిచినా బిగువటరా వంటివి బాగా గుర్తున్నవే కాని అంతకంటే ప్రసిద్ధమైనవి ఇంకా చాలా వున్నాయి. పుస్తకానికి శీర్షికంగా అమరిన 'అందాల ఓ మేఘమేలా' 'ఔనా నిజమేనా' మనసున మల్లెల మాలలూగెనే వగైరాలు. బిఎన్ తీసిన మరో కళాఖండం ' బంగారు పాప'లో 'తళాంగు థకదిమి తోల్ బొమ్మ దీని తమాష చూడవె కీల్‌బొమ్మ' అన్న పాట వేదాంత ధోరణిలో సాగితే 'యౌవన మధువనిలో వన్నెల పూవుల వుయ్యాల' అనేది చక్కటి ప్రేమ గానం.'భాగ్యరేఖ'లోనూ ఆయన చాలా పాటలు రాశారు గాని అందులో
ఉద్వేగాల చెలగాటం రియాల్టీ 'షో'
ఈ రోజుల్లో ఏ రోజు ఎవరు మాట్లాడుకున్నా టీవీ ప్రసక్తి లేకుండా ముగియదు. ఒకప్పుడు సినిమాల్లో చూపించినట్టు అనేవారు ఈ రోజున ప్రతిదానికి టీవీనే ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే టీవీ జీవితాన్ని దృశ్యమానం చేసింది.
టెలివిజన్ కేవలం వినోద సాధనమే కాదు, సమాచార సాధనమే కాదు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పార్శ్వాలన్నింటినీ ఒక్క దెబ్బలో సమన్వయ పర్చగలిగిన ఇలాంటి అపురూప సాధనం ఏదీ ఇంతకు ముందు మనుషులకు అందుబాటులో లేదు.
టీవీలో వచ్చే హింసా దృశ్యాలపైన లేదా వ్యాపార ప్రకటనలపైన తరచూ విమర్శలు వింటుంటాము. అవన్నీ నిజమే కాని అంతకంటే తీవ్రమైన ప్రభావం మన భావోద్వేగాలపై పడుతుంటుంది. అలాంటప్పుడు పది పదిహేనేళ్ల కిందటే ఈ మీడియా విస్తరించిన మన దేశం వంటి చోట్ల మరింత ఎక్కువగా ఈ ప్రభావం వుం డడం చాలా సహజం. మనకంటే దాదాపు యాభై ఏళ్ల ముందే టీవీ విప్లవం చూసిన అమెరికా వంటి దేశాల్లోనే దీని గురించి ఇప్పటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
టీవీ చూడాలంటే ఏకకాలంలో మన కళ్లు చెవులు కూడా పనిచేయాలి. ఏది ఎంత వరకు స్వీకరించాలి, ఏది అట్టిపెట్టుకోవాలి, ఏది తోసిపుచ్చాలి అని విశ్లేషించుకోవడానికి మెదడుకు వ్యవధి కావాలి కాని అంత వ్యవధి తీసుకోవడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. చూసే ప్రేక్షకుల పరిపక్వతను బట్టి అది ఆధారపడి వుంటుంది. అన్ని వయస్సుల వారు కలసి చూసే పరిస్థితిలో ఇది మరింత సత్యం. సమస్య ఏమిటంటే చూసే వారిపైనే కాదు, పాల్గొనే వారిపైన కూడా టీవీ కార్యక్రమాల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. అందుకే అది అన్ని విధాల మనుషుల భావోద్వేగాలతో ముడిపడిన వేల కోట్ల రూపాయల వ్యాపారం. సామాజిక కళాత్మక కార్యక్రమంగా కనిపిస్తుంటుంది. కనుక పూర్తిగా వ్యాపారం అనడానికి కూడా వుండదు. సమాచార సంబంధమైన విధినిర్వహణగా అనిపిస్తుంటుంది. కాని.. ఆ క్రమంలో మన కష్టసుఖాలూ, బాధలూ భావనలూ, ప్రేమలు, చావులూ, హత్యలూ, భక్తి, రక్తి అన్నీ బహిరంగ విన్యాసాలుగా మారిపోతుంటాయి. ఎప్పుడైతే బహిరంగ
వైభవ విషాదం- సావిత్రి!
ఆమెను తల్చుకోగానే తెలుగు దనం తొణకిసలాడే ఒక కళాత్మక మహిళా మూర్తి మనసులో కదలాడుతుంది. అభినయం మూర్తీభవించిన విదుషీమణి సాక్షాత్కరిస్తుంది. నటీనటులు ధరించిన పాత్రలూ వారి వాస్తవ జీవితాలూ పెనవేసుకు పోవడం అరుదుగానైనా జరుగుతుంటుంది. అందులోనే అనేక వైరుధ్యాలూ వుంటాయి. అలాటి అరుదైన జీవితం సావిత్రిది! ఆమె తర్వాత ఎంత ప్రతిభా వంతులైన కథానాయికలు వచ్చినా ఒక పట్టాన ఆమెతో పోల్చలేని స్థితి కొనసాగుతూనే వుంది. వాణిశ్రీ, శారద, సుహాసిని, సౌందర్య ఇలాటి వారిని ఎంతగానో ఆరాధించేవారు కూడా. సావిత్రిలోని సంపూర్ణత్వం వుందని మాత్రం పూర్తిగా ఆమోదించలేరు. ఆమె వేసిన ముద్ర అంత ప్రగాఢమైంది.
కొంతమంది లాగా సావిత్రి బంగారు సోపానాలపై నడిచి రాలేదు. వెండి తెర ఆమెకు ఎర్రతివాచీలు పర్చి ఆహ్వానించలేదు. నటనపై ఎనలేని మక్కువతో- ఎన్ని సార్లు కాదన్నా ఎదురీద గల తెగువతో ఆమె పోరాడి నిలదొక్కుకుంది. తెరపై ఒక మూల ఒక్కసారి కనిపించే పాత్రలైనా ధరించేందుకు సిద్ధపడి తర్వాత అక్కడ ఎవరున్నా తననే చూపించకతప్పని
అమర గాయకుని అద్భుత గీతావళి
హీరో కృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించగానే ప్రతి ఛానెల్‌లో కనిపించిన దృశ్యం 'తెలుగు వీర లేవరా' అన్న పాట. తెరపై ఎందరో నాయకులు నాయికలు ప్రతినాయకులు విదూషకులు, వుండొచ్చు. తెర వెనక దర్శకులు నిర్దేశకులు సాంకేతిక నిపుణులు మరింత మంది వుండొచ్చు. వారు కలసి రూపొందించిన చిత్రాల్లో అమోఘమైన సన్నివేశాలు పోరాటాలు, నృత్యాలు, సంభాషణలు మరెన్నో వుండొచ్చు. కాని - సినిమాల్లో అన్నిటికన్నా ఎక్కువగా గుర్తుండి పోయేవీ, నిరంతరం పెదవులపై కదలాడేవీ మాత్రం అందులోని పాటలే. తరాలు మారినా తరగని మాధుర్యం వాటిలో ఇమిడి వుండటమే ఇందుకు కారణం. సైగల్, మన్నాడే, మహ్మద్ రఫీ, కిశోర్ కుమార్, లతా మంగేష్కర్ వంటి వారి పాటలు అప్పటికీ ఇప్పటికీ భారతీయుల హృదయాలలో వెన్నెల పూలు పూయిస్తూనే వున్నాయి. ప్రేమ వియోగం, విషాదం, వినోదం తదితర రకరకాల సందర్భాలలో మదిలో మెదులుతూనే వున్నాయి. తెలుగు సినిమాకు సంబంధించినంత వరకూ ఆ కోవలో అగ్ర గణ్యుడు అమరగాయకుడు ఘంటసాల.
ఘంటసాల పేరు తల్చుకోగానే ఆయన మధుర స్వరం నుంచి జాలు వారిన మనోహర గీతాలు మనస్సును నింపేస్తాయి. వేయికి పైబడిన పాటలు, పద్యాలలో వారి వారి అభిరుచిని బట్టి అనుభూతిని బట్టి
Tuesday, September 13, 2011
నవరసాల బాటసారి
లత, రాధా అని ప్రేమగా పిలిచినా
అమ్మా అని బరువుగా పిలిచినా
ఆ కాస్తలోనే విరుపూ మాటలోనూ మనిషిలోనూ
శాలువా కప్పుకుని బరువుగా నడవడం
వేలు పైకి లేపి మాట్లాడ్డం
అర్థవంతమైన ఆక్షేపణీయమైన రీతిలో బిగ్గరగా నవ్వడం
ఆడవాళ్లకన్నా నాజూగ్గా కనిపించాలని ప్రయత్నించడం
కళ్లు పైకి కిందికీ తిప్పుతూ ఎదుటి వాళ్లను శల్య పరీక్ష చేయడం
తెలుగు వారికి చిరపరిచితమైన ఈ లక్షణాలన్ని ఎవరివో మళ్లీ చెప్పాలా?
శాలువా కప్పుకుని బరువుగా నడవడం
వేలు పైకి లేపి మాట్లాడ్డం
అర్థవంతమైన ఆక్షేపణీయమైన రీతిలో బిగ్గరగా నవ్వడం
ఆడవాళ్లకన్నా నాజూగ్గా కనిపించాలని ప్రయత్నించడం
కళ్లు పైకి కిందికీ తిప్పుతూ ఎదుటి వాళ్లను శల్య పరీక్ష చేయడం
తెలుగు వారికి చిరపరిచితమైన ఈ లక్షణాలన్ని ఎవరివో మళ్లీ చెప్పాలా?
Discussion on Gali arrest - Part 4 - Tv9
Senior Journalist Telakapalli Ravi and Political leaders' discussion on Gali Janardhan Reddy arrest in mining scam and Jagan links with Gali brothers
Discussion on Gali arrest - Part 3 - Tv9
Senior Journalist Telakapalli Ravi and Political leaders' discussion on Gali Janardhan Reddy arrest in mining scam and Jagan links with Gali brothers
Discussion on Gali arrest - Part 2 - Tv9
Senior Journalist Telakapalli Ravi and Political leaders' discussion on Gali Janardhan Reddy arrest in mining scam and Jagan links with Gali brothers
Tv9 - Opposition blames PM - Part 3
Tv9 - Opposition blames PM - Part 3
Tv9 - CM is fickle minded? - Part 2
Tv9 - CM is fickle minded? - Part 2
Tv9 - CM is fickle minded? - Part 1
Tv9 - CM is fickle minded? - Part 1
Monday, September 12, 2011
వూహించిన రీతిలోనే కెసిఆర్ వ్యాఖ్యలు
కరీం నగర్‌లో టిఆర్‌ఎస్ జన గర్జన సభ జయప్రదమవుతుందనడంలో ఎవరికీ సందేహాలు లేవు. అలాగే అక్కడ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా వూహించిన విధంగానే వున్నాయి. అయినా సకల జనుల సమ్మె, దానికి ముందు వెనక వివిధరకాల పిలుపులు ప్రజాస్వామిక పద్దతుల్లో కొనసాగాలని, ప్రాంతాల ప్రజల మధ్యఉద్రిక్తతలు పెంచబోవని ప్రతివారూ కోరుకోవాలి. ఈ సభకు ముందు రోజే మంత్రి టీజీ వెంకటేష్ చేసిన అసందర్భ వ్యాఖ్యలు కెసిఆర్ బాగా కలిసి వచ్చాయి. ఈ సభ జరుగుతున్నప్పుడే ఢిల్లీలో కావూరి సాంబశివరావు తదితరుల ఆజాద్‌ను కలుసుకుని మీడియా దగ్గర స్పందిస్తున్నారు. ఈ పరస్పర ప్రాంతీయ భాషణాలు వారి వారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వున్నాయనడం నిస్సందేహం. ఎందుకంటే అంతర్గతంగా చర్చించిన అంశాలు ప్రాంతాలను బట్టి నాయకులు ప్రకటిస్తుంటే ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వ్యాఖ్యానిస్తుంటే ప్రజలు కోరుకునే ప్రశాంతత మరింత దూరమై పోతుంటుంది. గత కొన్ని వారాల విరామం తర్వాత వివాదాలు మళ్లీ రాజేయాలని వీరంతా కృత నిశ్చయంతో వున్నారు. వాటిని కెసిఆర్ ఇతరులు అందిపుచ్చుకోవడం ఎలాగూ
బాలయ్య ..... బావయ్య
నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలని డైలాగు చెప్పిన బాలయ్య సింహౌత్సాహంతో రామరాజ్యం కేసి ఆశగా చూస్తున్నారు. ఈ దశలో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంపై రకరకాల వూహాగానాలు సాగుతున్నాయి. జనాకర్షణ గల నటుడుగా ఆయన ప్రకటనను తెలుగుదేశం శ్రేణులు ఆహ్వానించడంలో ఆశ్చర్యం లేదు. అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించాడు. ఒకప్పుడు అనంతపురంలో ఎన్టీఆర్ బాలయ్య నా రాజకీయ వారసుడు అని ప్రకటిస్తే రాజకీయ ప్రకంపనాలు పుట్టాయి.అలాటిచోటనే బాలయ్య ఇప్పుడు ఈ ప్రకటన చేస్తే చంద్రబాబు ఆహ్వానించడం మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది. ఇంతకూ బాలయ్య బావయ్య బాబయ్య ఎవరైనా కుటుంబాల పరిధిలో వారే గనక
నకిలీ కంపెనీల పేర్లతో నయ వంచన
ఎమ్మార్పణం-3
ఏజంటుగా నియమించుకున్న స్టైలిష్ హౌమ్స్‌కు చదరపు గజం రు5000 చొప్పున 100 ప్లాట్లు అప్పగించాలని, ఏజంటు ప్రతి విల్లాపైన నాలుగు శాతం తన కమిషన్‌గా అదనంగా వసూలు చేయొచ్చని దానితో కుదర్చుకున్న ఒప్పందంలో అవకాశమిచ్చారు. వాస్తవానికి అక్కడ భూమి ధర ఇంతకంటే డజను రెట్టు ఎక్కువ వుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యాభై వేలకు తక్కువ కాదు. అయినా మొదటి వంద ప్లాట్లు ఏజంటు ఈ రేటుకే అమ్ముకోవాలని, మిగిలినవి మార్కెట్ రేటు ప్రకారం విక్రయించవచ్చునని అవకాశమిచ్చారు. ఆ తర్వాత 2-5-05 న ఎమ్మార్ ప్రతినిధులు మరో కొత్త పేరును తెచ్చారు. అప్పటికే తాము భాగస్వామిగా చేర్చుకున్న ఎంజిఎఫ్ గ్రూపు అనుబంధ సంస్థ అయిన ఫ్రిడ్జి హౌల్డింగ్స్ లిమిటెడ్‌కు తమ 74 శాతం వాటాలో 34 శాతం ఇచ్చేందుకు అంగీకరించాలని కోరారు.ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ పంపిణీ ఏర్పాట్లు మార్చనవసరం లేదని ఎపిఐఐసి అధికారులు చెప్పారు. 2005 జూన్ 6న ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ మొదటి దశకు సంబంధించిన రాస్తూ భూమి లావాదేవీలు ఇంకా మొదలు కాకుండానే నగదు తీసుకుంటున్నట్టు తెలిసిందని, ఇది సంయుక్త వ్యవహారం గనక తమతో కలసి వ్యవహరించాలని కోరారు.అంటే అప్పటికే పరిస్థితి చేజారడం
ఏజంటుగా నియమించుకున్న స్టైలిష్ హౌమ్స్‌కు చదరపు గజం రు5000 చొప్పున 100 ప్లాట్లు అప్పగించాలని, ఏజంటు ప్రతి విల్లాపైన నాలుగు శాతం తన కమిషన్‌గా అదనంగా వసూలు చేయొచ్చని దానితో కుదర్చుకున్న ఒప్పందంలో అవకాశమిచ్చారు. వాస్తవానికి అక్కడ భూమి ధర ఇంతకంటే డజను రెట్టు ఎక్కువ వుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యాభై వేలకు తక్కువ కాదు. అయినా మొదటి వంద ప్లాట్లు ఏజంటు ఈ రేటుకే అమ్ముకోవాలని, మిగిలినవి మార్కెట్ రేటు ప్రకారం విక్రయించవచ్చునని అవకాశమిచ్చారు. ఆ తర్వాత 2-5-05 న ఎమ్మార్ ప్రతినిధులు మరో కొత్త పేరును తెచ్చారు. అప్పటికే తాము భాగస్వామిగా చేర్చుకున్న ఎంజిఎఫ్ గ్రూపు అనుబంధ సంస్థ అయిన ఫ్రిడ్జి హౌల్డింగ్స్ లిమిటెడ్‌కు తమ 74 శాతం వాటాలో 34 శాతం ఇచ్చేందుకు అంగీకరించాలని కోరారు.ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ పంపిణీ ఏర్పాట్లు మార్చనవసరం లేదని ఎపిఐఐసి అధికారులు చెప్పారు. 2005 జూన్ 6న ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ మొదటి దశకు సంబంధించిన రాస్తూ భూమి లావాదేవీలు ఇంకా మొదలు కాకుండానే నగదు తీసుకుంటున్నట్టు తెలిసిందని, ఇది సంయుక్త వ్యవహారం గనక తమతో కలసి వ్యవహరించాలని కోరారు.అంటే అప్పటికే పరిస్థితి చేజారడం
Sunday, September 11, 2011
ప్రాతిపదిక లేని ప్రచారార్బాటం
జగన్ ఆస్తులపై దర్యాప్తుకు హైకోర్టు ఆదేశాలివ్వడం, ప్రాంతీయ ఉద్యమాలు ప్రస్తుతానికి వ్యూహాన్వేషణలో తలమునకలవడం వల్ల తన ప్రభుత్వానికి కాస్త వూపిరి పీల్చుకునే వ్యవధి లభించిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఆ మేరకు సంతోషించి వూరుకుంటే అదొక పద్ధతి. కాని దాన్ని అతిశయోక్తిగా చిత్రించుకుని ప్రజల్లో ప్రచారార్భాటం సాగించాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్ యువ కిరణాల పేరిట అయిదు లక్షల ఉద్యోగాలు, స్త్రీ శక్తి బ్యాంకు, ఇందిర జల ప్రభ, రైతు రుణాల మాఫీ, పంటల బీమా పథకానికి నిధులు వగైరా పథకాల పరంపరతో దూసుకుపోగలనని భావిస్తున్నారు. ఆ వూపులో ఇప్పటికే ప్రజలను వేధిస్తున్న అనేకానేక సమస్యల పరిష్కారంపై దృష్టి మరల్చడానికి బదులు కొత్తసీసాలో పాత సారా చందంగా పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి ప్రచార ప్రహసనానికి తెర లేపుతున్నారు. ప్రతిష్టంభన నుంచి ప్రభుత్వం ఇంకా బయిటపడింది లేదు. రాజకీయ పాలనా పరమైన అనిశ్చితి
Saturday, September 10, 2011
ఎమ్మార్పణంలో ఎన్నెన్నో విచిత్రాలు
వేల కోట్ల రూపాయల విలువైన భూములను వాటిపై వచ్చే అపారమైన లాభాలను ఎమ్మార్‌కు కట్టబెట్టిన కథా క్రమంలో మలుపులకు లెక్కేలేదు. ఎన్ని మలుపులు తిప్పినా ఎమ్మార్ రథం నిరాఘాటంగా నడిచిపోయిందంటే ఏలినవారి ఆశీస్సులు ఎంత బలంగా పనిచేసిందీ తెలుస్తుంది.
తమ హయాంలో ఆరంభించినప్పటికీ భూములు సేకరణ, నిబంధనల మార్పు తర్వాతే జరిగిందిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇ,చ్చారు.అయినా ఆరంభం అప్పుడే గనక తెలుగుదేశం ప్రస్తావన అనివార్యంగానే వస్తుంది. ఎపిఐఐసి అనే నోడల్ ఏజన్సీ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, స్టార్ హొటల్, గోల్ఫ్ కోర్సు, విల్లాలతో కూడిన సమ్మిళిత నిర్మాణ పథకం(ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్) చేపట్టడానికి ఆసక్తి వ్యక్తీకరణ(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) కోరుతూ ప్రభుత్వం 1999 ఏప్రిల్4,2000 మార్చి 30, 2001జూలై 26 తేదీలలో బిడ్లను ఆహ్వానించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్, పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ లిమిటెడ్(పిజెఎస్‌సి)దుబారు యుఎఇ, ఐవోఐ కార్పొరేషన్ బెర్హాద్,మలేషియా, లార్సెన్ అండ్ టాబ్రో(ఇసిసి డివిజన్) షాపూర్జీ పల్టోన్జీ కంపెనీ లిమిటెడ్, ముంబాయి, సోమ్ ఆసియా లిమిటెడ్, హాంకాంగ్ అన్న అయిదు కన్సార్టియాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. అంచనాల కమిటీ ఇందులో ఎమ్మార్, ఐవోఐ,ఎల్ అండ్ టి లను జాబితాలో వుంచి వారితో సంప్రదింపులు జరిపింది. అయితే ఒప్పందం ఖరారు ఆఖరు తేదీ అయిన 2001 డిసెంబరు 15 నాటికి ఎమ్మార్ ప్రతిపాదన వొక్కటే అందడంతో దాన్నే ఖాయం చేసింది.
అదనపు భూమికై ప్రతిపాదన
2002 సెప్టెంబరు4న జివోఎంఎస్359 ద్వారా ఎమ్మార్ ప్రాపర్టీస్ పిజెఎస్‌సి దుబారు సంస్థను ఎంపిక చేసినట్టు తెలియజేసింది. దానితో అవగాహనా పత్రం(ఎంవోయు)కుదుర్చుకోవడానికి ఎపిఐఐసి వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికార మిచ్చింది. అదే సమయంలో ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని జాగ్రత్తగా గమనించాలని కూడా ఆదేశించింది. దాన్ని రెండు భాగాలుగా
ఎమ్మార్పణకు పూజారిగా ఎపిఐఐసి
జగన్ ఆస్తులపై దర్యాప్తు, గాలి జనార్ధనరెడ్డి అరెస్టులతో పాటు రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్న ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం ప్రయివేటీకరణ విధానాల వినాశకర ఫలితాలకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వ భూములనూ ప్రజల భూములను అప్పణంగా అప్పగించి ఇష్టారాజ్యం సాగించిన ఎమ్మార్‌కు ఎపిఐఐసి అధికారగణం దాసోహమైంది. ఒప్పందమే లోపభూయిష్టం కాగా దాన్ని కూడా అడుగడుగునా ఉల్లంఘిస్తుంటే ఉత్సాహంగా సహకరించింది. ఉద్దేశిత లక్ష్యాల నుంచి వైదొలగి వ్యాపారాలు చేసుకుంటున్నా, ఇష్టానుసారం ఒప్పందాన్ని మార్చేసి ఏకపక్షంగా కొత్త సంస్థలను సృష్టిస్తున్నా, వేల కోట్ల లాభాన్ని పూడ్చలేని నష్టంగా చూపిస్తున్నా అన్నిటికీ అప్పటి ఎపిఐఐసి పాలకవర్గం పూర్తిగా కుమ్మక్కయింది. బినామీ పేర్లతో ఖరీదైన కోటలు అనుమానాస్పదంగా కట్టబెడుతున్నా, దాన్ని మాఫీ చేసుకునేందుకు పెద్ద మనుషులు పందేరంలా ప్రముఖులకూ సౌధాలు కేటాయిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోయింది.దినేష్ రెడ్డి నాయకత్వంలోని విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంటు విభాగం జరిపిన దర్యాప్తులో ఇందుకు సంబందించి వెల్లడైన నిజాలు దిగ్బ్రాంతికరంగా
సంపూర్ణ సంపాదకుడు..
సున్నితమైన పద పొందిక, సముచితమైన వాక్య నిర్మాణం, సమతుల్య ప్రతిస్పందన కలిస్తే నండూరి రామమోహనరావు. ఆయన సంపాదక శాస్త్ర సాహిత్య వేత్త. తెలుగు సంపాదకులు సర్వజ్ఞులు అని ఆయన అంటుండేవారు. ఏ అంశంపైనైనా ఎడాపెడా రాసేస్తుంటారనీ, రాయాల్సి వుంటుందనీ ఆయన భావం. తను మాత్రం ఏది ఎడాపెడా రాయలేదు. ఆచి తూచి రాశారు. అలాగే జీవించారు. పాత్రికేయులకు ప్రామాణికంగా నిలిచార్తు. ఎన్నో వాద వివాదలతో నిండిన నేటి వాతావరణంలోనూ ప్రతివారూ ఆయనకు తలుచుకున్నారంటే కారణమదే. ప్రగతిశీల పాత్రికేయుడుగా మొదలై అనువాదాలలో రాణించి వైజ్ఞానిక రచనలకు వరవడి పెట్టి సంపాదకుడుగా స్థిరముద్ర వేసిన దినీ విజ్ఞాన సర్వస్వం ఆయన. అంత జ్ఞానవంతుడైనా ఒద్దికగా వుంటూ కలసిన ప్రతివారినీ ప్రభావితం చేసిన సంయమి.
నండూరి జీవిత సాఫల్యానికి బలమైన నేపథ్యమే వుంది. బళ్లో చదువుకుంటున్నప్పుడే విజ్ఞానం అన్న లిఖిత పత్రకను నడపడం ఆయన భావి జీవిత సంకేతం. అమ్మ సేకరించి పెట్టిన శ్రీ మహాభక్త విజయం చిన్నతనంలోనే చదివి దైవభక్తులతో పాటు దేశ భక్తుల జీవితాలూ తెలుసుకున్నారు. పెత్తండ్రి నండూరి శివరావు గుడివాడలో ప్రచురణాలయం స్థాపించడం వల్ల ద్విజేంద్రలాల్ రారు బెంగాలీ నాటకాల అనువాదాలు చదివే అవకాశం వచ్చింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే 'తేళ్లకు జెర్రులకు కూడా వెరవక అటకపైన వున్న ఆ కట్టలు తీసుకుని' చదువుతుండేవారు. ఆ వూపులోనే
Wednesday, September 7, 2011
జగన్ సంకేతాలు ఫలిస్తాయా?
తాను బిజెపిలో చేరే ప్రసక్తి లేదు,కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లే అవకాశం లేదు అంటున్న జగన్‌మోహన్ రెడ్డి 2014 లో యుపిఎలో చేరే విషయం ఆలోచిస్తానని చెప్పడం లొంగుబాటు అన్నట్టు వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇందులో ఆశ్యర్యం ఏమీ లేదు. లొంగుబాటు,సర్దుబాటు, తత్తరపాటు పదం ఏదైనా సరే సిబిఐ దర్యాప్తు విషయంలో పునరాలోచనకు ఇది దోహదపడుతుందేమోనన్న ఆలోచన, ఆశ అందులో వున్నాయి. అరెస్టును నివారించాలన్న ఆందోళన ఆయనలో బలంగా వుంది. ఈ ఆత్మరక్షణ స్థితిలో కాంగ్రెస్‌పై నాయకత్వంలోని యుపిఎలో చేరిక అవకాశాన్ని గురించి సూచనలు వదలడం నిస్సందేహంగా రాజకీయ వ్యూహమే. సోనియాపై ధ్వజమెత్తుతూ ఆమె అద్యక్షతన గల యుపిఎలో చేరడానికి సిద్ధపడటం, బిజెపితో జత కట్టేది లేదంటూ దాని నాయకురాలైన సుష్మా స్వరాజ్‌ను కీర్తించడం రాజకీయ విచిత్రం..ఢిల్లీకి గతంలో ఆయన వెళ్లినప్పటికి ఇప్పటికి రాజకీయ ప్రతిపత్తిలో చాలా తేడా వచ్చింది.దానికి తోడు అదే రోజున గాలి జనార్థనరెడ్డి అరెస్టు జరగడంతో మరీ అననుకూల వాతావరణం. గాలి జనార్ధనరెడ్డి అరెస్టు తర్వాత అందరి చూపూ ఆయనకు సంబంధించిన కేసులపైకి మళ్లింది. గాలితో తనకు సంబంధం లేదని చేసిన వ్యాఖ్యలు మీడియాపై ఆసహనం అసంబద్దమైనవి. గాలితో కుటుంబ సంబంధాలే గాక ఏదో ఒక విధమైన ఆర్థిక ఆనుబంధాలు లేవని చెబితే ఎవరూ నమ్మలేరు. యుపిఎతో సంబంధాల విషయానికి వస్తే జగన్ వర్గీయులు మొదటినుంచి అనేక సార్లు ఈ మేరకు సూచనలు వదులుతూనే వచ్చారు.శరద్ పవార్, మమతా బెనర్జీవంటివారిని ఇందుకు ఉదాహరణలుగా వారు చూపించేవారు. ఇప్పుడు కూడా జగన్ వారికోసమే ఇలాటి ప్రకటన చేసి వుండే అవకాశం వుంది. యుపిఎ భాగస్వాములు తనను కలుసుకోవడాన్ని సమర్థించుకోవడానికి ఈ వ్యాఖ్యలు దోహదం చేస్తాయని ఆయన అంచనా కావచ్చు. (వామపక్షాలు తాము బలంగా వున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌పైనే ప్రధానంగా పోరాడి యుపిఎ 1 కి బయిటనుంచి మద్దతు నిచ్చిన సందర్భం వేరు, ఇది వేరు. ఆ పరిణామం దశాబ్దాల చరిత్రకు కొనసాగింపు. పవార్, మమత వంటి వారు బిజెపితో కూడా కలసి వున్నారు. శరద్ పవార్ మహరాష్ట్ర రాజకీయాల రీత్యా అనివార్యంగా కాంగ్రెస్‌తో కలుస్తుంటారు.) ఇప్పుడు సిబిఐ దాడులనుంచి రక్షించుకోవడం ఆయనకు అన్నిటికన్నా ముఖ్యం గనక ఇలా మెతగ్గా మాట్లాడ్డంలో అశ్చర్యం లేదు. అయితే ఈ కారణంగానే కాంగ్రెస్ బాహాటంగా స్పందించే అవకాశం కూడా చాలా తక్కువ. ఇది తమ అంతర్గత వ్యవహారమైనట్టు సర్దుకుని వదిలిపెట్టే పరిస్థితి ప్రస్తుతం లేదు. రాజకీయంగా రాజీ కుదిరినా అది అమలులోకి రావడానికి చాలా దశలుంటాయి. ఏమైనా ఢిల్లీ ప్రకటన జగన్ బింకం సడలింపునే సూచిస్తుంది. కాంగ్రెస్‌పై ఆయన తీవ్ర విమర్శల విలువను ప్రశ్నార్థకం చేస్తుంది. పైగా మంత్రిత్వ శాఖలను గురించి కూడా మాట్లాడ్డం మరింత వింత గొల్పుతుంది.పార్టీలోనే వుంటే ఏదో ఒక దశలో ఆయనకు కేంద్రంలో పదవి లభిస్తుందని మొదట్లో అనేవారు. ఆ మార్గం వద్దనుకున్నతర్వాత ఇప్పుడు మాట్లాడ్డం అసందర్భమే.
ౖ
సిబిఐపై బిజెపి ద్వంద్వ భాషణం!
సిబిఐ విషయంలో బిజెపి ద్వంద్వ భాషణం చాలా హాస్యాస్పదంగా వుంది. గాలిపై చర్యలకు అభ్యంతరం లేదంటూనే సిబిఐ పక్షపాతం గురించి వారు గగ్గోలు పెడుతున్నారు. గుజరాత్‌లో సోరాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు వారి దృష్టిలో మహాపరాధంగా వుంది. వాస్తవం ఏమంటే వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనూ సిబిఐ ఇలాటి విమర్శలే ఎదుర్కొంది. ఆఖరుకు బాబ్రీ విధ్వంసం కేసులో అద్వానీని రక్షించి తనను శిక్షించాలనడంపై ఆ పార్టీ అగ్రనాయకుడు మురళీ మనోహర్ జోషీ కూడా రాజీనామా చేశారు. ప్రతిపక్షంలో వుండగా స్వతంత్ర సిబిఐ వుండాలన్న వాజ్‌పేయి ప్రధాని స్తానంలో వుండి దాన్ని పూర్తిగా వినియోగించుకోవడమే గాక ప్రతిపక్షాలపై ఉసి గొలిపారు. మాయావతి వంటి వారు ఆ మేరకు తీవ్ర విమర్శలు చేశారు కూడా. కనక సిబిఐని కాంగ్రెస్ అనేక సార్లు దుర్వినియోగపర్చి వుండొచ్చు గాని బిజెపి కూడా అందుకు మినహాయింపు కాదు. ఇక జగన్ కూడా వైఎస్ హయాంలో దాని కితాబులు తీసుకున్న సందర్భాలున్నాయి. ఎన్ని లొసుగులున్నా అది దేశంలో అత్యున్నత పరిశోధనా సంస్థ. గతంలో వివిధ చోట్ల జరిగినవే ఇప్పుడు లక్ష్మీనారాయణ నేతృత్వంలో పునరావృతమవుతున్నాయని చెప్పడానికి లేదు. ఒక వేళ చట్టపరమైన తప్పిదాలుంటే తప్పక కోర్టుల సహాయం తీసుకోవచ్చు.అంతేగాని రాజకీయ ప్రచారం కోసం ఒకే పల్లవి పదే పదే ఆలపించడం పలితమివ్వదు.
Tuesday, September 6, 2011
రాజకీయ దళారీకి అరదండాలు
మాజీ సమాజ్ వాది పార్టీ నాయకుడు అమర్ సింగ్‌కు అరదండాలు రాజకీయ దళారీ తనానికి గుణపాఠం. ములాయం సింగ్ యాదవ్ కుడి భుజంగా వుంటూ దేశ రాజకీయాలలో సూత్ర రహిత వ్యూహాలకు ముందు నిలిచిన అమర్ సింగ్ అణు ఒప్పందం తర్వాత అనిశ్చితిలో చిక్కిన మన్మోహన్ సర్కారును గట్టెక్కించడంలో కీలక పాత్రధారి అయ్యాడు. తన పార్టీని చేరువ చేయడమే గాక ఇతరత్రా కూడా మద్దతు దారులను పోగేసే సంధానకర్త అయ్యాడన్నది అప్పట్లొ బహిరంగంగా కనిపించిందే. ఈ సందర్భంలో బిజెపి కూడా వివాదాస్పదంగానే వ్యవహరించింది.పార్లమెంటులో నోట్లను చూపించడం సంచలనం కలిగించింది గాని వాటికోసం బిజెపి సభ్యులే తమ దగ్గరకు వచ్చారని నిందితులు అంటున్నారు.అద్వానీ సహాయకుడు సుదీంద్ర కులకర్ణి కూడా ఈ సందర్బంలో అరెస్టయ్యారు. వాస్తవంలో అమర్ సింగ్ అప్పటి పార్టీ ఎస్‌పి బిజెపికి బద్ద వ్యతిరేకిగా పేరు. అయినా సరే ఇన్ని బేరసారాలు జరిగాయంటే రాజకీయాలు ఎంత హీనంగా తయారయ్యాయో తెలుస్తుంది. పనిలో పనిగా ఈ తరుణంలోనే అమర్ సింగ్‌ను కూడా అరెస్టు చేశారు గాని అసలు ప్రభుత్వాధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ వారిని ఎందుకు పట్టుకోలేదనే ప్రశ్నకు మాత్రం సమాధానం లభించడం లేదు.ఈ వ్యవహారంలో మీడియా కూడా పాత్రధారి కావడం, పట్టివేత వ్యూహంలో బిజెపితో చేతులు కలపడం మరింత నాటకీయమైనవి. తెహల్కా, ప్రశ్నల కుంభకోణం, హవాలా వగైరా చాలా సందర్భాలలో బిజెపి నేతలు అవినీతి కుంభకోణాలలో చిక్కిపోయారు. అలాటి నేపథ్యంలో వారు కాంగ్రెస్ నేతలు ముడుపులు ఇస్తారని నిరూపించబోయిన బిజెపి నేతలు వాటిని స్వీకరించిన వారుగా ముద్ర వేయించుకోవడం రాజకీయాలలో నాటకీయ చిట్కాలు పనికి రావని వెల్లడిస్తుంది. అహ్మద్ పటేల్ తదితరుల పేర్లు కూడా ఈ వ్యవహారంతో ముడిపడివున్నాయి. మరి వారెవరైనా కనీస చర్యలకు గురవుతారా అన్నది చూడాలి.
Monday, September 5, 2011
ఆలస్యమైనా, అనివార్యంగా అరెస్టులు
కర్ణాటక కార్పొరేట్ రాజకీయ ప్రముఖుడు గాలి జనార్ధనరెడ్డి అరెస్టు ఆలస్యంగా అనివార్యంగా జరిగిందే. సుప్రీం కోర్టు అనేక సార్లు అక్షింతలు వేసినా ఆయన కొనసాగగలిగారనేది తెలిసిందే. అయితే స్వంత పార్టీనే అభిశంసించి మంత్రివర్గంనుంచి తప్పించిన తర్వాత,తామే నియమించిన లోకాయుక్త సంతోష్ హెగ్డే తీవ్రాతితీవ్రంగా ఎండగట్టిన తర్వాత దేశంలో అవినీతి వ్యతిరేక వాతావరణం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఈ పరిణామం వూహాతీతమైంది కాదు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో రాజ్యమేర్పరుచుకుని రెండు ప్రధాన పార్టీలైన బిజెపి కాంగ్రెస్‌లనూ, రెండు రాష్ట్రాలనూ కూడా ఆటాడించేందుకు యత్నించిన ఆయన ఆఖరికి చట్టం బోనులో బందీ అయ్యారంటే అందుకు బలమైన కారణాలున్నాయి. ఓబులాపురం మైనింగ్ కంపెనీ పేరుతో సరిహద్దులను అతిక్రమించి అనుమతులను ఉల్లంఘించి ప్రకృతిని ధ్వంసమవుతున్నా ప్రజలపై ప్రభావం పడుతున్నా ఖాతరు చేయకుండా ఆయన చెలరేగిపోయారు. అందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి, కర్ణాటక బిజెపి అండ లభించింది.ఎన్ని లక్షల టన్నులు అక్రమంగా తవ్వారు ఎన్ని వేల కోట్లు నష్టం తెచ్చారు అన్నది సుప్రీం సాధికార నివేదికలోనూ లోకాయుక్త అభిశంసనలోనూ వివరంగా వుంది. నిజానికి మన మైనింగ్ విధానంలో ప్రైవేటుకు పెద్ద పీట వేసిన తర్వాత ప్రకృతిపైన ప్రజాధనంపైన జరుగుతున్న దాడిలో ఇది ఒక భాగం.అయితే గాలి సోదరులు ప్రత్యక్ష రాజకీయాల్లో వున్నందువల్ల ఆ దాడి మరీ ఇష్టానుసారంగా సాగించగలిగారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో పెట్టని పరిశ్రమకు గనులు కట్టబెట్టిన అప్పటి ్ ప్రభుత్వ నిర్వాకం గురించి ఎంత చెప్పినా తక్కువే.సరిహద్దుల ఉల్లంఘన, అనుమతి మించి తవ్వకం,తవ్వింది చూపకపోవడం,రవాణాలో అక్రమాలు, రోడ్ల నాశనం, అటవీ సంపదపై దాడి, ఆరోగ్యాలపై ప్రభావం, స్వంత పార్టీ ప్రభుత్వాన్నే గడగడలాడించి ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో కంటతడి పెట్టించిన పెత్తనం ఇవన్నీ ప్రజలకు చెందాల్సిన ప్రకృతి వనరులు కొల్లగొట్టిన ఫలితంగా దక్కిందే.బళ్లారి అనేది వారి స్వంత రాజ్యంగా మారిపోయిందిన లోకాయుక్త హెగ్డే తేల్చిచెప్పారు. ఇంత జరిగినా ఆయనను వెనకేసుకొచ్చిన ఇంకా వస్తున్న బిజెపి అగ్రనేతల నీతి వచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో రాజకీయం వుండొచ్చు గాని నిర్దోషులపై చర్య తీసుకున్నట్టు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదం. ఇక జగన్ మోహన్ రెడ్డి గాలి తో తనకు సంబంధం లేదని చెప్పడం చెల్లుబాటయ్యేది కాదు. వైఎస్ తన తండ్రి అంటున్న గాలితో ఆయన కుటుంబానికి సంబంధం లేదని ఎవరూ నమ్మరు. పోనీ అరెస్టును ఆహ్వానిస్తున్నారా అంటే అదీ లేదు. పైగా ఆ విషయం తనను ప్రశ్నించడమే మీడియా నైతికతకు విరుద్దమని విరుచుకుపడడం మాత్రం వింత గొల్పుతుంది. అంగ బలం అర్థ బలం పుష్కలంగా గల గాలి రేపు న్యాయసహాయంతో తప్పక తన పోరాటం తాను చేయొచ్చు. చివరకు జరిగేది జరుగుతుంది.కాని మైనింగ్ చట్టాలను మార్చకపోతే మాత్రం రేపటి తరాలకు మిగిలేదేమీ వుండదు. ఆ వివరాలు,ఇతర అంశాలు మరో సారి చర్చించుకోవచ్చు.
Sunday, September 4, 2011
అమెరికా రాయబారి వ్యాఖ్యల ఆంతర్యం?
ఉపసభాపతిగా వున్నప్పుడు నాదెండ్ల మనోహర్( ప్రస్తుత సభాపతి) చేసినట్టుగా చెప్పబడుతున్న వ్యాఖ్యలపై గతంలో చర్చించాము. అమెరికా ప్రతినిధులు నిష్కామకర్మగా నివేదిస్తారనే భావన సరికాదని కూడ పేర్కొన్నాను.ఇప్పుడు అమెరికా రాయబారి పేరుతో వచ్చిన వ్యాఖ్యలు వాటికంటే ఎన్నో రెట్లు తీవ్రంగా వున్నాయి. కేంద్రం లొంగుబాటు ప్రదర్శించిందనీ, ఈ ప్రభావం ఇతర ప్రాంతాలపై పడుతుందనీ సూటిగానే ఆయన పేర్కొన్నారు. ఈ అభిప్రాయాల తప్పొప్పులు ఏమిటన్నది ఒకటైతే ఇంత సున్నితమైన సమస్యపై ఇంకా పరిణామాలు జరుగుతుండగానే వ్యాఖ్యానాలు చేయడం అమెరికా అమితాసక్తిని తెల్పుతుంది. అమెరికా పేరు ప్రస్తావించగానే వులిక్కిపడే వారు ఈ వాస్తవాలను గమనించాల్సి వుంటుంది. దేశ దేశాలలో తలదూర్చడం వారికి బాగా అలవాటైన విద్య. ఆధిపత్య వ్యూహాలలో భాగం కూడా. నిజానికి భారత దేశంలో అనేక వేర్పాటు వాద ఉద్యమాలను వారు ప్రోత్సహించడమే గాక ఈశాన్య రాష్ట్రాలలో ప్రాజెక్టు బ్రహ్మపుత్ర పేరిట విచ్చిన్నకర పథకాలను అమలు చేశారు. కాశ్మీర్ విచ్చిన్నకర ఉగ్రవాదుల మానవ హక్కులపై మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్ లేఖ రాసిన సంగతి, ఖలిస్తాన్ వాదులు అమెరికా కెనడాలలో తిష్టవేసిన సంగతి గుర్తుంచుకోవాలి. తెలంగాణా వాదాన్ని, అనేక అస్తిత్వ వాదాలను అక్కడి నుంచి బలంగా సమర్థించేవారు చాలా మంది వున్నారు. ఆ మాటకొస్తే టిఆర్‌ఎస్‌లో కీలక పాత్ర వహిస్తున్న కొందరు కూడా ఇటీవలి వరకూ అమెరికాలో స్థిరపడిన వారే. విచిత్రంగా అటు లగడపాటి,ఇటు మధు యాష్కీ వంటివారు ప్రవాస భారతీయులుగా అమెరికాలో బలమైన వ్యవస్తాగత సంబంధాలు కలిగివున్నవారే. మన దేశంలో అస్థిరత్వం పట్ల అమెరికా ఆసక్తి తెలియనిదేమీ కాదు. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా వుండగా ప్రత్యేకాంధ్ర(!) ఉద్యమాన్ని తీసుకురావడానికి నిధులు పంపించారని ఆయన కార్యదర్శిగా పనిచేసిన ప్రసాద్ రాశారు. అలాగే మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణా వేదిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇందిరాగాంధీ ఆర్థిక సహాయం చేశారని ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి ఒకసారి నేను పాల్గొన్న చర్చలో చెప్పారు. ఈ నేపథ్యంలో చూస్తే తెలంగాణా పరిణామాలపై రాయబారి వ్యాఖ్యలను లోతుగా పట్టించుకోవలసిన అవసరం కనిపిస్తుంది.అలాగే ఇవి తెలంగాణా సీమాంధ్ర ప్రాంతీయ రేఖలకు పరిమితమైనవి కావనీ తెలుస్తుంది.ఇవన్నీ ప్రయోజనాల ఘర్షణలు రాజకీయ పాచికలు మాత్రమే. వీటిని ఆ విధంగానే చూడాలి.
కెసిఆర్ తాజా పలుకుల తాత్పర్యం!
కేంద్రం తెలంగాణా ఇచ్చేట్టు లేదని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చేసినట్టు చెప్పబడుతున్న వ్యాఖ్యలు గతంలో ఈ బ్లాగులో చెప్పుకున్న అంశాల కొనసాగింపుగానే వున్నాయి. ఈ విషయంలో కేంద్రంపై భ్రమలు పెంచడం మంచిది కాదని అన్నప్పుడు ఆ నాయకులకు చాలా ఆగ్రహం కలిగింది. మొదటి నుంచి రకరకాల గడువులు ప్రకటిస్తూ కెసిఆర్ కేంద్రం పాత్రపట్ల గందరగోళం సృష్టించారు. ఆ మాయాజాలానికి ప్రజలనూ గురి చేశారు. ఈ విషయంలో ప్రాంతంలోని పార్టీలన్ని ఒక్కటేనని అంటూనే తన స్వంత పార్టీ బలాన్ని పెంచుకోవడానికి పాచికలు వేశారని కొండా లక్ష్మణ్ బాపూజీ లేదా తెలుగు దేశం నాయకులు విమర్శించారు. వారి వైఖరి సముచితమా అనే ప్రశ్న ఒకటైతే ఇన్ని దశాబ్దాలలోనూ కాంగ్రెస్ కేంద్రం నైజం తెలిసీ కేసిఆర్ ఎందుకు జనాన్ని వూరిస్తూ వచ్చారనే ప్రశ్న తప్పక ఎదురవుతుంది. తెలంగాణా ఇవ్వబోరని(నిజానికి అది ఇప్పటికే వుంది తప్ప ఎవరూ ఇచ్చేది కాదు. రాష్ట్ర విభజన ఇక్కడ వారి కోర్కె) ఇచ్చినా హైదరాబాదు లేకుండా ఇస్తారని ఆయన పేరిట ఒకే విధమైన లీకులు వచ్చాయంటే ఇది అనధికారికంగా జరిగిన అధికార లీకుగానే భావించాలి. దీనిపై ఇప్పుడు కోంగ్రెస్ నేతలు కోపం ప్రదర్శిస్తున్నారు. వీరి వైఖరినీ విశ్వసించడం కుదిరేపని కాదు.తెలంగాణా స్బరణ చేస్తూనే కాంగ్రెస్, టిఆర్‌ఎస్,తెలుగు దేశం తమ తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నాయి.ఇవన్నీ ఒకటైనట్టు నటిస్తాయే గాని నిజంగా కావు. ఇంతకూ ఇస్తారన్నప్పుడు గాని ఇవ్వబోరని చెబుతున్నప్పుడు గాని ఆయనకు వున్న ఆధారాలేమిటి? కేవలం ఆ సమయంలో తమ రాజకీయ అవసరాలను బట్టి మాట్లాడ్డం తప్ప మరేమీ లేదు. ఇలా అంటూనే ఇప్పుడు సకల జనుల సమ్మెతో తెలంగాణా వచ్చేస్తుందని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏకాంశ పార్టీగా టిఆర్‌ఎస్‌కు ఇలా మాట్లాడ్డం కలసి రావచ్చునేమో గాని ఈ విన్యాసాల వల్ల విశ్వసనీయత పూర్తిగా దెబ్బతినిపోవడం అనివార్యం.2014లో వంద స్థానాలు గెల్చుకోవడం గురించి ఇప్పుడే మాట్టాడ్డం ముందుగా కూసిన కోయిల చందమే అవుతుంది.ఇంతకూ ఈ 20 మాసాలలోనూ తెలంగాణా సమస్యపై టిఆర్‌ఎస్ ఇతరులు రకరకాలుగా మాట్లాడటంలోనే వారి ఇరకాటం తేటతెల్లమవుతుంది.ఇన్ని మాట మార్పుల మధ్యన ప్రజలు తమ దైనందిన జీవిత పోరాటాన్ని వదలిపెట్టి ఈ ఎండమావుల వెంట పరుగులు తీస్తుంటారని అనుకోలేము. జగన్ వర్గం రాజీనామాలు ఆమోదిస్తే అక్కడ ఉప ఎన్నికలపైకి దృష్టి మరలుతుంది. మొత్తంపైన సకల జనుల సమ్మె ప్రారంభం కావలసిన తరుణంలో ఇలా మాట్లాడ్డం ద్వారా టిఆర్‌ఎస్ నాయకులు తమపై భారాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. భవిష్యత్తులో ఇందుకు సంబంధించి మరిన్ని మలుపులు చూడొచ్చునేమో.ఇలా అంటూనే విషం తాగడం గురించి కూడా కెసిఆర్ ప్రస్తావించడాన్ని బట్టి ఆయన ధోరణి మారేది కాదని కూడా తేలిపోతుంది. నిరుత్సాహం పెంచుతూ ఇలాటి మాటలు జోడించడం ద్వారా ఆయన ఏ సంకేతం ఇవ్వాలనుకుంటున్నారో వేరే చెప్పాలా?
Saturday, September 3, 2011
ఆస్తుల ప్రకటన ఆఖరి వాక్యం కాదు
తనపై వచ్చే ఆరోపణలను పదే పదే వినిపించే విమర్శలను అలా సాగనివ్వడం కన్నా తనుగా ఏదైనా ప్రకటన చేయాలని చంద్రబాబు భావించడం మంచిదే. అయితే ఎవరి గురించి వారు చెప్పుకునేదానికి ఎప్పుడూ పరిమితులు,భిన్నాభిప్రాయాలు వుంటాయి. ఈ విషయమైనా అంతే. అయితే ఈ ఆస్తుల ప్రకటన వల్ల వాటికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. దాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారనేది వారి ఇష్టం. ఎప్పటికప్పుడు వ్యక్తుల చుట్టూ తిరగడం లేదా తిప్పడం అలవాటైన మన రాజకీయం ఇప్పుడు చంద్రబాబు ఆస్తుల ప్రకటనపై కేంద్రీకృతమైంది. ఇందుకు సంబంధించిన ఆయన సవాళ్లపై గతంలోనే వ్యాఖ్యానించాను.ఇక ఇప్పుడు ఆయన ఐచ్చికంగా చేసిన ప్రకటన వల్ల విమర్శలు అగడమంటూ జరగదు. ఇంత తక్కువ అస్తులున్నాయా బినామీలు లేవా అంటూ సందేహాలు ముందుకు రావడం సహజమే.అయితే వివాదాల ద్వారా అవి నివృత్తి అయ్యేవి కావు. ఆసక్తి గల వారు చట్టరీత్యా తాము తీసుకోగలిగిన చర్యలు తప్పక తీసుకోవచ్చు. వీలుంటే న్యాయస్థానాల సహాయం తీసుకోవచ్చు. అలా గాకుండా వూరికే వాదోపవాదాలు అరోపణలతో ఎంత సమయం వెచ్చించినా వొరిగేదేమీ వుండదు. జగన్‌పై ఆరోపణలకు చంద్రబాబుపై ఆరోపణలకు పోటీ పెట్టి చూడటం నిరర్థకం.తాను వ్యాపారం బాగా చేయడం వల్ల పెట్టుబడులు భారీగా వచ్చి పడ్డాయని జగన్ స్వయంగా చెప్పుకోవడం, ఆ పెట్టుబడులు ఎలా వచ్చాయనేదానిపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు వున్నాయి గనక దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశించడం రీత్యా కూడా ఉభయుల వ్యవహారంలో తేడా వచ్చింది. వీరిద్దరే గాక అందరిపైనా కూడా చట్టపరమైన దర్యాప్తులు తప్పక జరపొచ్చు.కాని ఒకరి విషయం వచ్చినప్పుడు మరొకరి సంగతి లేవనెత్తడం వల్ల చిక్కులో వున్న వారిని కాపాడ్డమే జరుగుతుంది. .. భారీ ఎత్తున రాజకీయ చదరంగాలు నడిపేవారికి అంగబలం అర్థబలం పుష్కలంగా వుంటాయని ప్రతివారికీ తెలుసు. అలాటి భావన వుండటం వేరు,భౌతికంగా నిరూపించడం వేరు. ఇలాటి అంశాలు విధానపరంగా చూడాలే తప్ప వ్యక్తులపై కేంద్రీకరించి వాదనలు సాగదీయడం వల్ల ఫలితమేమీ వుండదు. వైఎస్ కుటుంబం,చంద్రబాబు కుటుంబం అంటూ ఈ ఉభయుల మధ్యనే పరిభ్రమిస్తుంటే వ్యవస్తాగతమైన కీలాకాంశాలు మరుగున పడి పోయే ప్రమాదం చాలా వుంటుంది.
Thursday, September 1, 2011
వికీలీక్స్‌వివాదం: వివిధ కోణాలు
ప్రపంచాన్ని కుదిపేసిని వికీలీక్స్ పత్రాల సెగ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌కు తాకినట్టు కనిపిస్తుంది.రాష్ట్రం అట్టుడికి పోయిన 2009 డిసెంబరు 12 వ తేదీన డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అమెరికా కన్సలేట్ జనరల్‌తో చేసినట్టు చెప్పబడుతున్న వ్యాఖ్యానాలు ఇందుకు కారణం. అయితే ఆయన అలా చెప్పినట్టు అమెరికా ప్రతినిధి చెప్పడమే ఇందుకు ఆధారం. తాను అలా అనలేదని మనోహర్ ఖండిస్తున్నారు.ఇంతకూ మనోహర్ పేరిట అమెరికన్ కేబుల్‌లో వున్న విషయాలు ఆ రోజుల్లో చాలా మంది చెప్పుకున్నవే.ఇప్పటికీ అలాటి మాటలు వినిపించడం లేదని చెప్పడం కష్టం. తెలంగాణా విభజన కోసం సాగుతున్న ఉద్యమంలో మావోయిస్టుల పాత్ర గురించి విరుద్ధ దృక్పథాలు కనిపిస్తుంటాయి. మావోయిస్టులు, లేదా వారితో సంబంధం గల వారు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యమంలో పాత్ర వహించడం కనిపిస్తూనే వుంటుంది.నగ్జలైట్ గ్రూపులు కొన్ని నేరుగా ఉద్యమాన్ని బలపరుస్తుంటే మరికొందరు తమవైన వేదికలు ఏర్పాటు చేసుకుని స్వంత కార్యాచరణ సాగిస్తున్నారు. ఇటీవలనే బిజెపి నాయకుడు కిషన్ రెడ్డి ఒక ఉమ్మడి సభలో మాట్లాడుతూ మావోయిస్టులతోనైనా కలసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదని ప్రకటించారు కూడా.
ఉద్యమంలో మావోయిస్టులు ఎంత శాతం వున్నారు వారి ప్రభావం ఎంత అన్న దానిపై భిన్నాబిప్రాయాలున్నా వారున్నారనే అంశాన్ని ఎవరూ కాదనలేరు.ఉండటం తప్పని కూడా
ఉరిశిక్షల చర్చలో ఉచితానుచితాలు
రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితులైన మురుగన్,శంతన్,పెరిరవాళన్‌ల ఉరిశిక్ష విషయమై సాగుతున్న వివాదం సందర్భంగా అనేక అసందర్భ వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఆ ముగ్గురికి ఉరి శిక్ష వేయకుండా క్షమాభిక్ష కోరుతున్న పిటిషన్లను సుప్రీం కోర్టు 1999లో తిరస్కరించింది. తర్వాత వారు రాష్ట్రపతికి మొరపెట్టుకున్నారు. వాటిపై అభిప్రాయం చెప్పడానికి , పరిశీలించి తిరస్కరించడానికి కేంద్రం అయిదేళ్లు తీసుకుంది.ఆ పైన రాష్ట్రపతి కార్యాలయం మరో ఏడేళ్లకు తిరస్కరణ నిర్ణయం ప్రకటించింది.ఇటీవల తమిళనాడు శాసనసభ వారి శిక్షను రద్దు చేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాక వివాదం ముదిరింది. తమకు ముందు అధికారంలో వున్న డిఎంకె ఉరిశిక్ష అమలు చేయాలంటూ వత్తిడి చేసిందని ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత
కుయ్యి కుయ్యి .. కుయ్యో కుయ్యో!
వ్యక్తులకైనా వ్యవస్థలకైనా ప్రచారం వల్ల వున్నదానికి మించిన ప్రాధాన్యత లభిస్తుంది. మామూలుగా కుయ్యి కుయ్యి అంటే నవ్వొస్తుంది. కాని ఒకప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ శబ్దాన్ని అనుకరిస్తూనే ఓటర్లను ఆకట్టుకున్నారు. కుయ్యి కుయ్యి అంటూ 108 వాహనాలు దూసుకొచ్చి ప్రాణాలు నిలబెడుతున్నాయనేది ఆయన ప్రధాన ప్రచార నినాదాల్లో ఒకటి. ఆరోగ్యశ్రీ ద్వారా అపరేషన్లు చేయించడం మరొకటి. ఆచరణలోనూ వీటి ప్రయోజనం కనిపిస్తున్నందువల్ల ప్రజలూ నిజమే అని బలపర్చారు. ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు అదే 108 వాహనం వెళ్లిందని బాధతో అనుకున్నారు కూడా. అప్పుడూ ఇప్పుడూ కూడా ఈ విషయంలో విమర్శలు లేవని కాదు. లోపాలూ లేవని కాదు. అవి ఇప్పుడు పరాకాష్టకు చేరాయి. అందరికీ అత్యవసర చికిత్స అందించేందుకు ఏర్పాటైన 108 వ్యవస్థ తానే ప్రాణాంతక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. దీనికి కారకులెవరంటే చెప్పడం కష్టం. దాన్ని సృష్టించి అప్పుల పాలు చేసి వదలిపెట్టిన సత్యం రామలింగరాజా? లేక దాన్ని కొనసాగించేందుకు ముందుకొచ్చిన జివికె సంస్థనా? కాక ఒప్పందం ప్రకారం నిధులు ఇవ్వలేదంటున్న ప్రభుత్వమా? 108కి చెందిన 33 ఎకరాల విలువైన భూమిపై ఆశలా?
ప్రాణాపాయ స్థితిలో వుండే వారికి అత్యవసర చికిత్స చేస్తూ వేగంగా వైద్యశాలకు చేర్చేందుకు 108 చేసిన సేవ చాలా గొప్పదే. విడివిడిగా ఆంబులెన్సులు కాక 802 వాహనాలను ఒకే వ్యవస్థగా సమకూర్చి వైద్యశాలలను కూడా గొలుసుకట్టుగా చేర్చడం వల్ల వెనువెంటనే తీసుకుపోవడానికి వీలు కలిగింది. ఇదంతా నడిపించే 4500 మంది ఉద్యోగుల సేవానిరతివల్ల, శ్రద్ధాసక్తుల వల్ల వందలాది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఇది కాదనలేని వాస్తవం. అయితే నిన్న సత్యం లేదా నేడు కెవికె దీన్ని ధార్మిక దృష్టితో చేస్తున్నారన్నది పాక్షిక సత్యమే. ఆ ఖర్చులో 95 శాతం ప్రభుత్వమే భరిస్తుంది. అంటే నిర్వాహక బాధ్యత తీసుకున్నవారు సకాలంలో సక్రమంగా చెల్లిస్తే
Subscribe to:
Posts (Atom)