Pages

Friday, September 30, 2011

ఆజాద్‌ నివేదిక, అనంతరం..



తెలంగాణా సమస్యపై ఏదో వెంటనే జరిగిపోతుందని భావించేవారు, జరిగిపోవాలని కోరుకునే వారు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌ ఇచ్చే నివేదికకు శ్రుతి మించిన ప్రాధాన్యత కల్పించారు. కాని వాస్తవం ఏమంటే దానికి ముందు తర్వాత కూడా కేంద్రం నుంచి వెలువడుతున్న సూచనల్లో కొత్తదనమేమీ లేదు.ఈ సమస్యపై వారికి అవగాహన లేదని కాదు, దాన్ని వెల్లడించాలనే ఉద్దేశమే లేదు. కెసిఆర్‌ ఏ జోస్యాలు చెప్పినా కాంగ్రెస్‌ నాయకులు మాత్రం అలాటి సాహసం చేయడం లేదు. ఎందుకంటే వారికి అంతర్గత పరిస్తితులు మరింత బాగా తెలుసు. శుక్రవారం నాడు హౌం మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడి గొంగళి అక్కడే వున్నట్టు స్పష్టమవుతుంది. కాకపోతే కాంగ్రెస్‌ ఒక అవగాహనకు రావడానికి ఆజాద్‌ అ ద్యక్షురాలికి ఇచ్చిన నివేదిక దోహదపడుతుందని మాత్రం అనుకోవాలి. ఎనిమిది మాసాల కిందట ఇచ్చిన శ్రీకృష్ణ నివేదికకే ఠికాణా లేనప్పుడు ఈ ప్రహసనంతో ఏదో ఒక వొరిగి పడుతుందని మౌలిక నిర్ణయాలు మారిపోతాయని బొత్తిగా ఆశించలేము. నిజానికి సమయం చాలా పడుతుందని ఆజాద్‌ నిన్న, చిదంబరం ఈ రోజు స్పష్టంగా చెప్పారు. ఎవరైనా ఈ వాస్తవాలను గమనంలో పెట్టుకుని వ్యవహరించాల్సి వుంటుంది.

1 comment: