Pages

Friday, September 21, 2012

వాల్‌ మార్ట్‌ - అక్కడ మూత.. ఇక్కడ మోత!


తన పాలక కూటమి భాగస్వాములే సమర్థించలేకపోతున్న నిర్ణయాన్ని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నిస్సంకోచంగా ఆకాశానికెత్తేస్తున్నారు. బలహీనుడని చాలా మంది పొరబాటుగా అభివర్ణించే ప్రధాని నిజానికి అమెరికా ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి వీర కేసరిగా విజృంభిస్తాడని అణు ఒప్పందం సమయంలోనే రుజువైంది. ఎప్‌డిఐ వ్యవహారం దానికి కొనసాగింపే.
విచిత్రమేమంటే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఎఫ్‌డిఐ నిర్ణయాన్ని ప్రకటించి వాల్‌మార్ట్‌ వంటి వాటికి ఆహ్వానం పలికిన రోజునే న్యూయార్క్‌లో అతి పెద్దదైన వాల్‌మార్ట్‌ దుకాణానికి తాళం పడింది.అట్లాంటా సిటీస్‌ అనే ప్రముఖ వెబ్‌పత్రిక ఆ రోజున ఇలా శీర్షిక ఇచ్చింది:'మృత్యు విహారం: వాల్‌ మార్ట్‌ తాకిడికి చిల్లర దుకాణాలు దుంప నాశనం' అని పేర్కొంది
జూన్‌ 30న అమెరికాలోని మరో సంపన్న నగరం లాస ్‌ఏంజల ్‌్సలో వేలాది మంది ప్రజానీకం ' వాల్‌మార్ట్‌ అంటే దారిద్య్రం అని నినాదాలిస్తూ పెద్ద ప్రదర్శన చేశారు.అంతకు ముందు రాజధాని వాషింగ్టన్‌ డిసిలో మరో ప్రదర్శన జరిగింది. వాల్‌మార్ట్‌ వద్దు వద్దు అన్నది ఇప్పుడు అక్కడ పెద్ద నినాదంగా మార్మోగుతున్నది. వాల్‌మార్ట్‌
చిన్న వ్యాపారులను దెబ్బ తీస్తుందనే ఈ నిరసనలు ఒక వైపున పెల్లుబుకుతుంటే లాస్‌ ఏంజిల్స్‌ పాలక మండలి మాత్రం మన వాళ్లలాగే ముందు రోజున వారి భవన సముదాయానికి అనుమతి నిచ్చిందట. అయితే తర్వాత నిరసనలు దాన్ని సాగనీయడం లేదు. అట్లాంటాసిటీ వ్యాసంలో వివరాల ప్రకారం చూస్తే వాల్‌మార్ట్‌ 2006లో చికాగో పరిసరాలలో ప్రవేశించిన తర్వాత అక్కడున్న 306 దుకాణాలలోనూ 82 మూతపడ్డాయట. నిజానికి అది ప్రవేశించిన చోట వున్న దుకాణాలపై ప్రభావం 35 నుంచి 60 శాతం వరకూ వుంటుందని 'ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ క్వార్టర్లీ' చెబుతున్నది.మందుల దుకాణాలైతే ఒకో మైలుకు 20 శాతం, ఫర్నిషింగ్‌ షాపులైతే 15 శాతం, హార్డ్‌వేర్‌ 18 శాతం, బొమ్మల దుకాణాలు 25 శాతం చొప్పున కూలిపోయాయి. న్యూయార్క్‌ సిటీ పబ్లిక్‌ అడ్వకేట్‌ 2010లో చేసిన అధ్యయనం ప్రకారం వాల్‌మార్ట్‌ రెండు ఉద్యోగాలు కల్పిస్తే మూడు హరీమంటాయి. (ఇది అమెరికా లెక్క. ఇండియాలో ఈ శాతం చాలా ఎక్కువగా వుంటుంది) వాల్‌ మార్ట్‌ ముందస్తుగా కొని నిల్వ వుంచుకోవడం వల్ల 2008లో బియ్యం ధరలు మూడు రెట్లు పెరిగాయని అధికారిక అంచనా. అలాగే గోధుమలు కూడా. కనక ఎఫ్‌డిఐ నిర్ణయానికి సమర్థనగా చేసే వాదనల్లో అధిక భాగం అసత్యాలే.

సర్కారు నివేదికలోన్లే సత్యాలు

మన రాష్ట్రంలో లోక్‌సత్తా నేతలతో సహా కొందరు చిల్లరలో ఎఫ్‌డిఐ ల వల్ల రైతాంగానికి లాభం జరుగుతుందని వాదిస్తున్నారు.అమెరికాలో రైతులకు సబ్సిడీలే ఆధారమవుతున్న తీరు ప్రధాన కథనంలో చూశాం. ఈ వాదనను యుపిఎ ప్రభుత్వ హయాంలో వచ్చిన నివేదికలే తోసిపుచ్చుతున్నాయి. 11వ ప్రణాళికకు సంబంధించిన వర్కింగ్‌ గ్రూపు నివేదిక, పార్లమెంటు 19వ స్తాయి సంఘ నివేదిక చిన్న సన్నకారు రైతులు అత్యధికంగా వున్న మన దేశానికి వాల్‌మార్ట్‌ వల్ల మేలు గాక కీడే జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. 5.9 కోట్ల రైతాంగ కుటుంబాలు(32 కోట్ల మంది గ్రామీణులు) అయిదు ఎకరాల లోపు కమతాలపై ఆధారపడి బతుకుతున్నారు. అదే అమెరికాలో కమతాలు 250 రెట్టు, ఆస్ట్రేలియాలో కమతాలు 4000 రెట్లు పెద్దవిగా వుంటాయి.60 శాతం ఆహార పదార్థాలు రైతులు వ్యవసాయ కార్మికులు వస్తు మార్పిడి పద్ధతిలోనే వినియోగిస్తారు.వాణిజ్య మార్కెట్‌కు వచ్చేది 40 శాతం మాత్రమే. కనక వాల్‌మార్ట్‌ దాడితో ఆహార భద్రత కూడా దెబ్బతింటుంది అని ఆ నివేదికలు తెలిపాయి.ఆఖరుకు సంస్కరణలలో మన్మోహన్‌కు కుడి భుజం లాటి మాంటెక్‌ సింగ్‌ ఆహ్లూవాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం నివేదిక కూడా చిన్న రైతులపై పడే ఈ ప్రభావాన్ని పేర్కొనక తప్పలేదు.
చిల్లరలో ఎప్‌డిఐల వల్ల చిన్న రైతులు చిన్న వ్యాపార కుటుంబాలు కూడా చితికిపోతాయనేందుకు ఈ ఆధారాలు చాలవా? ఇంతకూ చిల్లర కొట్టు పెట్టడానికి కూడా విదేశాలను ఆహ్వానించేట్టయితే ఇక మన ఆర్థికాభివృద్ధి గురించిన అతిశయోక్తులెందుకు?

15 comments:

  1. అదేమిటోనండి మీరు నిజంజెప్పినా నాకు అందులో చాలా వెలితి కనిపించింది.

    ReplyDelete


  2. అదేమిటో మీకే అర్థం కానప్పుడు నేను చేయగలిగిందేమిటి? ఇది ఒక భాగానికి సంబంధించిన సమాచారం మాత్రమే. అది కూడా నా స్వంతం కాదు, నివేదికలు, నిపుణులు ఇచ్చిందే. మీ వెలితి ఏమిటో చెప్పగలిగితే దాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తాను.

    ReplyDelete
    Replies
    1. నాకు కనిపించిన వెలితి, మీరు అన్ని వివరించారు కానీ విదేశీ ప్రత్యక్ష్య పెట్టుబడులును రప్పించడానికి వీళ్ళు చూపుతున్న కారణాలు ఎందుకు తప్పో చూపించలేదు.
      అదే కాకుండా పర్యావరణ కాలుష్యం గురించి కూడా వివరిస్తే బాగుండేది.

      Delete
    2. ఇది చాలా పరిమితమైన ఎంట్రీ. మీరన్నవి మరో సమయంలో తప్పక పేర్కొనే ప్రయత్నం చేద్దాం. ఇది ముందే సూటిగా రాసివుంటే అప్పుడు నా సమాధానం అవసరమయ్యేది కాదు.

      Delete
  3. వాల్‌మార్టులు చైనాలో ఎప్పటినుంచో వున్నాయి. ఇండియాలో వామపక్షాలు వ్యతిరేకిస్తాయి. చైనా గూడ్సు ఇండియాలో డంప్ కావడానికి వామపక్షాలు వ్యతిరేకించవు.
    చైనాలో అణుశక్తి, ఆయుధాలు పెంచుకుంటోంది, అది వాకే, ఇండియాలో వ్యతిరేకిస్తాం. కుందనకుళంలో వామపచ్చాలు వుద్యమాలు చేయవు, అది రష్యా కాంట్రాక్టు. అమెరికాతో అణూ ఒప్పందాలు వ్యతిరేకిస్తాయి.
    "అడిగానని అనుకోవద్దు
    చెప్పకుండ దాచేయొద్దు
    ఏమిటీ రహస్యం
    తెర గారు ఏమిటీ విచిత్రం? ":)

    ReplyDelete
    Replies
    1. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదని ఒక సామెత ఉన్నది. చైనా చేసినవన్నీ మనమూ చేసేద్దామా?? అక్కడి పరిస్తితులు వేరు, ఇక్కడి పరిస్తితులు వేరు. ఎవరికి అవసరమైన పనులు వాళ్లు చెయ్యాలి.

      చైనా భారతదేశం కన్నా చాలా సంపన్నదేశం. చైనాలో పేదరికం 2 శాతం కన్నా తక్కువుంటే, భారతదేశంలో 30 శాతం కన్నా ఎక్కువుంది. జనచైనా ప్రభుత్వం పనితీరు బాగుందని 85 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేస్తే, భారతప్రభుత్వ పనితీరు బాగుందని గట్టిగా ఇరవై శాతం మంది కూడా చెప్పలేరు!! మింగ మెతుకు లేనివాడికి మీసాలకు సంపెంగనూనె కావాల్సి వొచ్చిందట!! సగం జనాభాకి తిండీ, ఉద్యోగం, చదువు, ఇల్లు లేని భారతదేశాన్ని వాల్ మార్టులు వచ్చేసి ఉద్ధరించేస్తాయి అని మీరు సంబరపడిపోతున్నారు.

      చైనా అణుశక్తిని భారత కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించట్లేదని మీరు తెగ బాధపడిపోతున్నారు. "భారత" కమ్యూనిస్టు పార్టీలు భారతదేశంలో అణుశక్తిని వ్యతిరేకించగలవు గానీ చైనాలో ఎట్లా వ్యతిరేకించగలవు??ఇక్కడ్నుంచి వెళ్లి, అణుశక్తికి వ్యతిరేకంగా చైనాలో ఉద్యమాలు చెయ్యమంటారా??

      అన్నట్టు రష్యా ఎంతమాత్రమూ కమ్యూనిస్టు దేశం కానే కాదు. రష్యాలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షం!! గుడ్డెద్దు చేలో పడ్డట్టు తలాతోకా లేని విమర్శలు చెయ్యకుండా కొంత ఆలోచించండి!!

      చైనాలూ, రష్యాలూ అంటూ 1960ల నాటి పాత చింతకాయపచ్చడి విమర్శలు చెయ్యటమే తప్ప ఏమాత్రం తర్కం లేదు మీ వాదనలో!!

      Delete


  4. విచిత్రం మీ దగ్గరే వుంది సార్‌.. ఇండియాలో సమస్యల గురించి మాట్లాడుతుంటే చైనా రష్యాల గురించి మాట్లాడుతున్నారు. ఇంతకూ నేను ఇచ్చిన వివరాలు కమ్యూనిస్టులవి కావు సార్‌, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ గురుమూర్తి గారు ఉటంకించినవే! అది కూడా అమెరికా వనరుల నుంచి తీసుకున్నవి! విధానాలపై విమర్శలుండాలి గాని ఎప్పుడూ చైనా రష్యా కమ్యూనిస్టులు ఇలా ఒకే రాగమాలపించడం ఎందుకు సార్‌.. మీరు వాల్‌మార్ట్‌కు స్వాగతం పలకదలిస్తే పలకండి.. వాటి గొడవెందుకు? ఇదే భాషలో జవాబు నివ్వడం నాకు చేతగాని పని కూడా కాదు.. అయితే అది మన బ్లాగు చర్చ స్థాయిని పెంచదు. చాలా రోజుల తర్వాత స్నేహపూర్వకంగా ఈ మాట చెబుతున్నాను. ఆ పైన మీ ఇష్టం..మాడరేటర్‌ ఇష్టం.

    ReplyDelete
  5. రవి గారు, మీ వాదన బాగుంది.

    సందర్భమో కాదో కాని, నేనొక ఉదాహరణ చెప్తాను.

    కోక్, పెప్సీలు రాక ముందు దేశీయ కోలాలు ఉన్నా, వినియోగం చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ అనారోగ్యకర సాఫ్ట్ డ్రింకుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

    ReplyDelete
    Replies
    1. bonagiri గారు - నిజం చెప్పారండీ!! కోక్ పెప్సీలు వచ్చేటప్పుడు కూడా సంస్కరణవాదులు చాలా హంగామా చేశారు. "దేశం బాగుపడిపోతుంది; జపాన్, సింగపూర్ల తలదన్నే స్థాయికి ఎదిగిపోతుంది" అని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు చూస్తే, జనం మొహాన రంగునీళ్లు, పురుగుల మందులు కొట్టి పెప్సీ కోలా కంపెనీలు కోట్లకు పడగలెత్తాయి. రూపాయి రంగునీళ్లు పది రూపాయలకు అమ్ముతున్నా అడిగే దిక్కు లేదు. జనం జేబుకు చిల్లు, అధికారపార్టీకి కార్పొరేట్ విరాళాలు తప్ప దేశానికి ఒరిగింది సున్నా!! కొత్తగా వాల్ మార్టులు వచ్చి ఇంతకన్నా పొడిచేసేది ఏం ఉండదు!!

      Delete
  6. బిచ్చగానికి భిక్ష వేయాల్సింది అత్తగారు కాని కోడలు వేస్తే ఎలా అన్న మాదిరిగా ఉంది బిజెపి ఎఫ్ డి ఐ కు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం. వాల్ మార్ట్ ని ఆహ్వానిస్తే తాను ఆహ్వానించాలి గాని కాంగ్రెస్ ఆహ్వానించడమేమిటని బిజెపి గోల. అంతే అనుకుంటాను.

    ReplyDelete
  7. మీరన్న దాంట్లో వాస్తవం వుంది. బిజెపి మాత్రమే కాదు, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా అంతే. అయితేనేం, ప్రజాస్వామ్యం గనక ఇప్పుడు వ్యతిరేకించడం వరకూ మంచిదే కదా..

    ReplyDelete
  8. . కాకపోతే బిచ్చగాడికి బిచ్చం కాదు, దొంగకఁ తాళాలు ఇవ్వడం అంటే మరింత బాగుంటుంది..

    ReplyDelete
  9. ప్రధానమంత్రి గారు చెప్పినదాంట్లో తప్పేమిటొ నాకర్ధంకాలేదు. ఓ 25 సంవత్సరాలక్రితం ఇలానే అన్నారు, కంప్యూటర్లొస్తే ఉన్న ఉద్యోగాలు గోవిందా అని. ఈప్పుడు దానివల్ల కొన్ని లక్షలమంది బ్రతుకుతున్నారు. ఎందుకుసార్ ఊరికే తెలిసీ తెలియనివన్నీ చెప్పి ప్రజల్ని తప్పుత్రోవ పట్టిస్తారు?

    ~సూర్యుడు

    ReplyDelete
    Replies
    1. క్షమించాలి ఇప్పుడు ఉద్యోగాలు ఊడిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి ఈ computers ఎక్కడ పడేయ్యాలో తెలుపగలరు సూర్యుడు గారు.

      Delete
    2. @సూర్యుడు గారు - కంప్యూటర్లు వస్తున్నాయి, భారతదేశం అభివృద్ధి చెంది పారేస్తుంది అని ఊదరగొట్టారు అప్పటి ప్రధానులు. ఉద్యోగుల సంఖ్య తగ్గి, కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరిగాయి తప్ప భారతదేశంలో పేదరికం తగ్గిందా?? అక్షరాస్యత పెరిగిందా?? దేశం ఏమన్నా జపాన్, సింగపూర్, చైనా అయిపోయిందా??

      కంపెనీలు పెట్టడానికి లక్షల ఎకరాల భూములు స్వాహా అయ్యాయి. పర్యావరణం కలుషితం ఐపోయింది. ప్రభుత్వం మాటలు నమ్మి కంపెనీల కోసం భూములు పోగొట్టుకున్న వాళ్లు అడుక్కుతింటున్నారు. భూముల అమ్మకం పేరిట లక్షల కోట్ల కుంభకోణాలు బయటపడుతున్నాయి. బయటపడనివి ఇంకా కోట్ల కోట్లు ఉండొచ్చు. రాజకీయాలూ, కార్పొరేట్లూ, మీడియా కుమ్మక్కయ్యాయి. తొందర్లోనే సన్నీ లియోన్ పుణ్యమాని బూతు సినిమాలు కూడా ఫ్యామిలీతో కలిసివెళ్లి చూసే రోజులొస్తాయి.

      ఇవేవీ కనబడవు మీకు. కంప్యూటర్లూ, కీ బోర్డులూ, మౌసులూ మాత్రమే అభివృద్ధి కాదు. జనానికి జీవనోపాధి కావాలి, తిండీ బట్టా గూడూ కావాలి. చదువు, వైద్యం కావాలి. తింటానికి తిండి కావాలి. ముప్పై రూపాయలు పెట్టి పావు కిలో కూరగాయలు కొనుక్కునే రోజులు పోవాలి.

      Delete