Pages

Tuesday, September 27, 2011

శంకర్‌ రావుపై జడ్జి ఆదేశం ప్రభావం?



ఎప్పటికప్పుడు ఏవో విపరీత వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే మంత్రి శంకర్‌ రావు హౌం మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యను సుమోటాగా తీసుకోవాలని సిబిఐ దర్యాప్తు జరిపించాలని జస్టిస్‌ నరసింహారెడ్డి ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి.అయితే ఆ ఆరోపణల లాగే ఈ ఆదేశం కూడా ఇంకా పూర్తి స్వరూపం తీసుకోవలసి వుంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజా ప్రయోజన వాజ్యం కింద దీన్ని తీసుకోవడానికి అన్ని అర్హతలు వున్నాయని న్యాయమూర్తి భావించినప్పటికీ తుది నిర్ణయం జరగాల్సింది మరోచోట. శంకరరావు వ్యాఖ్యలు మంత్రివర్గంలో అస్తవ్యస్త పరిస్థితిని ప్రతిబింబిస్తున్న మాట నిజమే గాని న్యాయమూర్తి ఆదేశాల పరిమితులను కూడా పరిగణనలోకి తీసుకుంటేనే విషయం అర్థమవుతుంది.

1 comment:

  1. మంత్రివర్గంలోని మంత్రి ఆరోపణనలను, అదందులోనూ తోటి మంత్రిపై అవినీతి ఆరోపణనలను సుమోటోగా స్వీకరించడంలో టెక్నికల్‌గా తప్పులేదు. అవి వుత్తుత్తి రాజకీయ ఆరోపణలైతే శంకర్రావుకు 3నెలలు చర్లపల్లి వాసమూ, 6ఏళ్ళు ఎన్నికల్లో పాల్గోకుండా ఆంక్ష, 10లక్షలు ఫైనూ విధిస్తే సరైనదే అవుతుంది.

    టాంక్‌బండ్ మీద బతుకమ్మ మీద పోలీసు ఆంక్షలు తొలగించడం (గతంలో అలాంటి ఆదేశాలద్వారా విధ్వంసం జరిగిన అనుభవం అయివుండీ) శాంతిభద్రతల విషయంలో పోలీసు విధుల్లో జోక్యంచేసుకునేందుకు గౌరవనీయ న్యాయాధీశుల చొరవ అత్యుత్సాహము, ఆహ్వానించాల్సిన విషయం! హైకోర్ట్, అసెంబ్లీ , సచివాలయం సెంట్రల్ హాల్‌లోనూ, బతుకమ్మ/దసరా సంబురాలు/హాజ్ ప్రార్థనలు, అనుమతించాలని ఎవరైనా అంటే సుమోటోగా అనుమతిస్తారేమో అని ప్రజలు ఆశించడంలో అనౌచిత్యం వుండదేమో!

    ReplyDelete